ఏపీ అసెంబ్లీలో జనసేన పోరాటానికి ప్రణాళికలు సిద్ధం.. పవన్ టార్గెట్ ఏంటి ?

జనసైనికులు మాత్రం తమ నేత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారని సంబరాల్లో చేసుకుంటున్నారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం, సీనియర్ నేతలు లేకపోవడం జనసేనను ఇబ్బంది పెట్టే అంశం, అలాగే బూత్ స్థాయి నుంచి, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం లేకపోవడం కూడా జనసేనపై ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలు లేకుండా పోవడానికి కారణంగా చెబుతున్నారు.

news18-telugu
Updated: May 20, 2019, 5:42 PM IST
ఏపీ అసెంబ్లీలో జనసేన పోరాటానికి ప్రణాళికలు సిద్ధం.. పవన్  టార్గెట్ ఏంటి ?
పవన్ కల్యాణ్
news18-telugu
Updated: May 20, 2019, 5:42 PM IST
పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారని సర్వేలన్నీ తేల్చేశాయి. కింగ్ మేకర్ అవుతారా లేదా ఊహించని స్థాయిలో అందరికీ షాక్ ఇచ్చేలా సీట్లు సాధిస్తారా అనేది మే 23న తేలిపోతుంది. అయితే జనసైనికులు మాత్రం తమ నేత తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారని సంబరాల్లో చేసుకుంటున్నారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం, సీనియర్ నేతలు లేకపోవడం జనసేనను ఇబ్బంది పెట్టే అంశం, అలాగే బూత్ స్థాయి నుంచి, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం లేకపోవడం కూడా జనసేనపై ఎగ్జిట్ పోల్స్ లో అంచనాలు లేకుండా పోవడానికి కారణంగా చెబుతున్నారు. అయితే పవన్ మాత్రం అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని, టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షంలో కూర్చుంటే ఎలా వ్యవహరించాలి...లేదా కింగ్ మేకర్ గా అధికార పక్షంతో పవర్ పంచుకోవాల్సి వస్తే ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి.. అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ప్రతిపక్ష హోదాలో మాత్రం పవన్ అసెంబ్లీలో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తారని అంటున్నారు. ఎందుకంటే పవన్ ఎప్పుడూ అంచనాలకు అందకుండా, ఎత్తులు వేయడంలో దిట్ట అని ఆయన సన్నిహితులు అంటుంటారు. అయితే పవన్ మాత్రం అసెంబ్లీ లోపల, బయట ప్రధానంగా ప్రత్యేక హోదా పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందుసైతం పవన్ ప్రత్యేక హోదాపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.

ముఖ్యంగా పవన్ తన రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘంగా కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ లోపల, బయట ఒకే అజెండా అని పలుమార్లు తెలిపారు. ఇదిలాఉంటే ఇకపై జనసేనను పూర్తిస్థాయిలో గ్రౌండ్ లెవ్ వరకూ తీసుకెళ్లేందుకు నేతలకు బాధ్యతలు సైతం అందచేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే స్థానిక ఎన్నికల్లో సైతం బలంగా పోరాడేందుకు జనసేనను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రానుందని ఎగ్జిట్ పోల్స్ సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి అటకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో జనసేనను జనంలోకి బలంగా తీసుకెళ్లాలంటే ప్రత్యేక హోదా ఉద్యమమే లక్ష్యంగా జనసేన పావులు కదుపుతోంది. అయితే మే 23న జనసేన సాధించే సీట్లను బట్టే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని పార్టీప్రముఖులు పవన్ కళ్యాణ్ కు దిశానిర్దేశనం చేస్తున్నారు.

First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...