Home /News /andhra-pradesh /

Pawan Kalyan: వైసీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: వైసీపీలో చేరేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నం.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్, జగన్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, జగన్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan Vs YSRCP: వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక.. ఈర్ష్యతోనే పవన్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ స్వామి. పవన్‌పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం విరుచుకుపడ్డారు.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంతటా జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించే చర్చ జరుగుతోంది. ఇటు రాజకీయాలు.. అటు సినిమాల్లోనూ.. ఈయనే హాట్ టాపిక్. వైసీపీని పవన్ కల్యాణ్ టార్గెట్ చేయడంతో.. ఆ పార్టీ నేతలు కూడా పవన్‌కు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా  ఏపీ డిప్యూటీ నారాయణ స్వామి (Narayana swamy) కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీని, సీఎం జగన్‌ను విమర్శించే అర్హత జనసేన పవన్‌ కల్యాణ్‌కు లేదని మండిపడ్డారు. బుధవారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు నారాయణ స్వామి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.

    వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక.. ఈర్ష్యతోనే పవన్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ స్వామి. పవన్‌పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం విరుచుకుపడ్డారు. వైసీపీలో చేరేందుకు పవన్‌ ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారని.. కానీ జగన్‌ దరి చేరనీయలేదని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్.. రచ్చ రచ్చ.. రంగంలోకి దిగిన ఫ్యాన్స్.. అరెస్ట్ చేసిన  పోలీసులు

    కాగా, రిపబ్లిక్ (Republic Movie) సినిమా ప్రిరిలీజ్ పంక్షన్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ నిప్పులు చెరగడంతో .. అప్పటి నుంచి పవన్ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ మొదలయింది. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రులు విరుచుకుపడ్డారు. ఐతే  వీరి గొడవలోకి నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna murali) ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ ఎపిసోడ్ మరింత హీటెక్కింది. సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లేదని విమర్శించడమే కాదు.. ఆయన వ్యక్తిగత విషయాలపైనా ఘాటుగా స్పందించారు పోసాని. అంతేకాదు తనను పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారని.. తనకేమైనా జరిగితే పవన కల్యాణే బాధ్యత వహించాలని అన్నారు. తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నారు పోసాని. వరుసగా రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టి పవన్‌ కల్యాణ్‌పైనిప్పులు చెరిగారు పోసాని.

    YCP Vs Pawan Kalyan: సినీ పరిశ్రమకు పవన్ పెద్ద గుదిబండ.. ఆయన్ను పక్కనబెట్టారు

    అటు పోసాని కృష్ణమురళి తీరుపై జనసేన పార్టీతో పాటు పవన్ అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పోసాని ప్రెస్ మీట్‌ను అడ్డుకునేందుకు చాలా మంది అభిమానులు ప్రయత్నించారు. వారిపై కూడా పోసాని మండిపడ్డారు. మరోవైపు పోసాని కృష్ణమురళిపై జనసేన తెలంగాణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ.. ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా రోజుకో ఎపిసోడ్‌తో పవన్ వర్సెస్ వైసీపీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఐతే దీనిపై ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ స్పందించలేదు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Janasena, Pawan kalyan, Ysrcp

    తదుపరి వార్తలు