నేడు విజయవాడలో బీజేపీ, జనసేన కీలక భేటీ...కమలంతో ప్రయాణం...

ఇటీవల ఢిల్లీలో బీజేపీ పార్టీ పెద్దలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో కలిసి పోరాడేందుకు అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో జనసేన, బీజేపీ నేతలు సమావేశం జరగనుంది.

news18-telugu
Updated: January 16, 2020, 7:12 AM IST
నేడు విజయవాడలో బీజేపీ, జనసేన కీలక భేటీ...కమలంతో ప్రయాణం...
బీజేపీ, జనసేన
  • Share this:
నేడు జనసేన, బీజేపీ నేతల సమావేశం విజయవాడలో జరగనుంది. రెండు పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఒక అవగాహనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో బీజేపీ పార్టీ పెద్దలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీతో కలిసి పోరాడేందుకు అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో జనసేన, బీజేపీ నేతలు సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి స్నేహహస్తం చాపిన నేపథ్యంలో బీజేపీ ఏపీ నేతలు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో మూడు రాజధానులపై స్పందించిన బీజేపీ.. ఒకే చోట రాజధాని ఉండాలని అంటోంది. అటు జనసేన కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తోంది. ఇక 2014లోనూ బీజేపీ, టీడీపీలతో కలిసి పని చేసిన జనసేన, ప్రస్తుతం మరోసారి బీజేపీతో చేతులు కలపనుంది.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>