అమరావతి రైతులను కలిసి తీరుతాం...ఎవరో అడ్డొస్తారో చూస్తాం...నాగబాబు సవాల్...

రాజధాని ప్రాంతంలోని రైతులకు తమ సానుభూతి తెలపడం తమ బాధ్యత అన్నారు. ఎర్రబాలెం వరకు తప్పకుండా వెళ్తామని, తమను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని నాగబాబు అన్నారు.

news18-telugu
Updated: January 20, 2020, 10:53 PM IST
అమరావతి రైతులను కలిసి తీరుతాం...ఎవరో అడ్డొస్తారో చూస్తాం...నాగబాబు సవాల్...
నాగబాబు
  • Share this:
రైతులకు సానుభూతి తెలిపేందుకు కూడా వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకోవడం సరికాదని జనసేన నేత నాగబాబు అన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద మీడియాతో నాగబాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు తమ సానుభూతి తెలపడం తమ బాధ్యత అన్నారు. ఎర్రబాలెం వరకు తప్పకుండా వెళ్తామని, తమను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని నాగబాబు అన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ స్థిరమైన నిర్ణయం తీసుకుందని, దానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మరోవైపు జనసేన అధినేత రాజధాని గ్రామాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దంటూ పోలీసులు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. దీంతో జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు