హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైఎస్సార్సీపీ ఆదేశాలను అమలు పరుస్తున్నారా..? తూ.గో జిల్లా ఎస్పీపై జనసేన మండిపాటు

వైఎస్సార్సీపీ ఆదేశాలను అమలు పరుస్తున్నారా..? తూ.గో జిల్లా ఎస్పీపై జనసేన మండిపాటు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో చెప్పడంపై జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తీరుపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

 • News18
 • Last Updated :

  రాజ్యాంగ వ్యవస్థలలో ఉన్న అధికారులు ఒక రాజకీయ పార్టీ ఆదేశాలను అమలు చేయడం తగదని జనసేన పార్టీ విమర్శించింది. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో ఈనెల 9వ తేదీ (శనివారం)న ఏర్పాటు చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో చెప్పడంపై జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తీరుపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది అప్రజాస్వామికం, పోలీసు వ్యవస్థకే తలవంపులు అని తెలిపింది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

  ప్రకటనలో ఆయన... తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబరేటరీస్ పై అక్కడ సమీప గ్రామస్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే జనసేన నాయకులు ఎస్పీకి తెలియజేశారు. సభకు అనుమతి కావాలని.. పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరినప్పుడు ఆయన సుముఖుత వ్యక్తం చేసి, సభ నిర్వహించడానికి ఆమోదం కూడా తెలిపారు.

  అయితే ఈ రోజు సాయంత్రం సభకు అనుమతులు రద్దు చేసుకుంటున్నామని.. 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడం వైఎస్ఆర్సీపీ ఆదేశాలను అమలు చేయడంగానే భావిస్తున్నామని మనోహర్ పేర్కొన్నారు. దివీస్ కంపెనీ వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని వేలాదిమంది ప్రజలు ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతియుతంగా వారి మనోభావాలను అర్ధం చేసుకోవడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం. ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యధావిధిగా 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా గళాన్ని వినిపిస్తాం. పోలీసులను అడ్డుపెట్టుకొని జనసేన కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేస్తున్నామన్న విషయాన్ని గుర్తెరగాలని నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Andhrapradesh, AP News, East godavari, Janasena, Janasena party, Nadendla Manohar, Pavan kalyan

  ఉత్తమ కథలు