ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారని చాలా సర్వే సంస్థలు భావించిన అభ్యర్థి... జనసేనకు చెందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. జనసేన తరపున ఆయన విశాఖ నుంచీ లోక్ సభ స్థానానికి పోటీ చేశారు. తన గెలుపు కోసం ఆయన కొందరు మేథావుల టీంని కూడా రంగంలోకి దింపారు. తాను గెలిస్తే, ఏం చేస్తాననే అంశంపై జేడీ వారి ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి మరీ వివరాలు చెప్పారు. అందువల్ల జెడీ గెలుస్తారని చాలా మంది అనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే... వైసీపీకి చెందిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. దీనిపై ట్విట్టర్‌లో స్పందించిన లక్ష్మీ నారాయణ... ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని అన్నారు. విజయం సాధించిన నరేంద్ర మోదీ, జగన్‌లకు అభినందనలు తెలిపారు. తనపై విజయం సాధించిన ఎంవీవీ సత్యనారాయణను కూడా అభినందించారు.
I respect the mandate given by the people.
Congratulations to Shri @narendramodi Ji and Shri @ysjagan garu .
I also congratulate Shri MVV Satyanarayana for the win in Visakhapatnam as the MP.
I hope the new governments will fulfil the dreams of the people.
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) May 24, 2019
కొత్త ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సేవ విషయంలో తన పని తాను చేసుకుపోతానని అన్నారు. దాదాపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లే, జేడీ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోనే ఉంటాననీ, సమస్యలపై పోరాడతానని అన్నారు. రాజకీయాల్ని వదిలేసే ప్రసక్తే లేదన్న పవన్... ప్రత్యేక హోదాను అధికార పార్టీ సాధించిపెట్టాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
AP Election Results : వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్...
Lok Sabha Election Results 2019 : బీజేపీ పెద్దల ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోదీ
జగన్ కోసం కాన్వాయ్ రెడీ... ప్రత్యేకతలేంటో తెలుసా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena party, Visakhapatnam S01p04