JANASENA CHIEF PAWAN START WAR AGAINST ANDHRA PRADESH GOVERNMENT ON STEELPLANT PRAIVAITIZATION NGS VSP
Pawan: పవన్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దీక్షాస్త్రం
పవన్ కళ్యాణ్ దీక్ష
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరి లో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు.. ఇక పై నేరుగా ఏపీ ప్రభుత్వం పోరాటానికి జనసేనాని సై అంటున్నారు..
Pawan Fight wiht YCP: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ఉద్యమం మరో రూట్ తీసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల విశాఖ వెళ్లి ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలిపపిన పవన్ .. కేంద్ర ప్రభుత్వం (Central Government) తీరుపై ఎలాంటి విమర్శలు చేయలేదు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అని స్పష్టం చేశారు. కేంద్రంలో పెద్దలకు మన బాధ ఏం అర్థమవుతుందని.. కేంద్ర ప్రభుత్వానికి మన కష్టాలు తెలియచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వాని (AP Government) కి రెండు వారాల డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ ముగిసింది. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు..
పవన్ డెడ్ లైన్ పెట్టారు.. గడువు ముగిసింది. కానీ ఆయన సినిమాలు చేసుకుంటున్నారు.. ఉక్కు ఉద్యమాన్ని లైట్ తీసుకున్నారు. ఎదో ఆరోపణలు చేసి సైలెట్ అయ్యారు అనే విమర్శలు వచ్చాయి. కానీ అనూహ్యంగా పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. నేరుగా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట దీక్ష చేపట్టనున్నారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ఎల్లుండి దీక్షకు కూర్చుంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలో కూర్చొంటారు. ఉక్కు కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అలాగే దీక్ష సమయంలోనే అయితే ఆ దీక్షలో పవన్.. మళ్లీ పాత పాటే పడుతారా..? రాష్ట్ర ప్రభుత్వానికి మరో డెడ్ లైన్ పెట్టి వదిలేస్తారా..? లేక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా.. లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అన్నదానిపై క్లారిటీ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.
మరి వైసీపీ స్టాండ్ ఏంటి..?
వైసీపీ విషయానికి వస్తే.. ఇప్పటికే అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ప్రధానికి వరుసగా లేఖలు రాసారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరించ కుండానే ఏ విధంగా కొనసాగించవచ్చో సూచించారు. అఖిలపక్షం తో కలిసేందుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే, ప్రధాని కార్యాలయం నుంచి దీని పైన స్పందన రాలేదు. రాష్ట్ర స్థాయిలో దీని పైన చేయటానికి ఏమీ లేదని..మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్..ఇప్పుడు తాము స్పందించకపోతే ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలనే ఉద్దేశంతో వైసీపీ కనిపిస్తోంది. కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయటం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనేది వైసీపీ నేతల వాదన. మరి పవన్ దీక్ష తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.