JANASENA CHIEF PAWAN KALYAN TOUR WEST GODAVARI DISTRICT FOR FIGHT WITH FISHERMAN ISSUES NGS
Pawan Kalyan: ఆ జిల్లాపై పవన్ ప్రత్యేక ఫోకస్.. రేపు భారీ బహిరంగ సభ.. మత్యకారుల ఓట్లే టార్గెట్టా? వైసీపీ వ్యూహం ఏంటి?
రేపు పశ్చిమగోదావరి పవన్ పర్యటన
Pawan Kalyan tour: జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆ జిల్లాపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రేపు పర్యటనకు సిద్ధమయ్యారా..? మత్స్యకారుల ఓట్లను టార్గెట్ చేశారా.. మరి దీనిపై అధికార వైసీపీ వ్యూహం ఏంటి..?
Pawan Kalyan tour: జనసేన (janasena) ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు సర్వ సిద్ధమైంది. ఇప్పటికే ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఆ పార్టీ వివిద కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. 2014, మార్చి 14న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. గుంటూరు జిల్లా (Guntur District) మంగళగిరి మండలం కాజలో ఈ వేడుకలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం విధానాలపై పోరాటం చేస్తునే.. తీవ్ర సమస్య ఎదుర్కొంటున్న వారి తరపున పోరాటం చేయాలని జనసేన నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) పర్యటనకు సిద్ధమయ్యారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఈ జిల్లాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు జనసైనికుల టాక్.. ముఖ్యంగా ప్రభుత్వంపై ఏఏ వర్గాలు అసహనంతో ఉన్నాయో.. ఆయా వర్గాలను చేరువ చేసుకోవడం జన సేన రాజకీయ వ్యూహాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రేపటి పర్యటన ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో రేపు పవన్ పర్యటించనున్నారు. అక్కడ మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నరసాపురం రుస్తుం బాద్లో సాయంత్రం మత్స్యకార అభ్యున్నతి పేరుతో జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మత్స్యాకారుల సమస్యలపై మాట్లాడనున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుటన్న ప్రతి మత్స్యకారుడుకి జనసేన అండగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వనున్నారు. ఎన్నికల ముందు వారి జీవనోపాధిపై హామీలు కురిపించిన సీఎం జగన్.. తరువాత వారిని పట్టించుకోకపోవడం దారుణమని.. ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన హామీలు గుర్తు చేసి తీరుతామని జనసైనికులు అంటున్నారు.
జనసేన పార్టీ మత్స్య వికాస విభాగం సంకల్పంతో, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో 20-02-2022 తేదీ ఆదివారం సాయంత్రం నరసాపురంలో జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభ.
ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టి పెట్టే సమయం, ఆలోచన రెండూ లేవంటూ ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మత్స్యకారుల కోసం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జీవోపై గళమెత్తడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా పార్టీ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తు పోరాటంపైనా పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
రేపటి బహిరంగ సభ కోసం పవన్.. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నరసాపురానికి చేరుకుంటారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి.
జనసేన పవన్ మాటలను రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. జగన్ సీఎం అయిన తరువాత ఇచ్చిన హామీలే.. కాకుండా.. ఎన్నో రకాల ఫలాలు మత్స్యాకారులకు అందించారని.. ఎప్పటికే ఆ వర్గం వైసీపీ వెంటే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.