మళ్లీ ఢిల్లీకి పవన్ కళ్యాణ్... ఈసారి ప్లానేంటి?

Andhra Pradesh | Pawan Kalyan : బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచీ పవన్ కళ్యాణ్‌కి కొత్త సమస్య ఎదురవుతోంది. మాటిమాటికీ ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది.

news18-telugu
Updated: March 18, 2020, 6:02 AM IST
మళ్లీ ఢిల్లీకి పవన్ కళ్యాణ్... ఈసారి ప్లానేంటి?
పవన్ కళ్యాణ్ (Twitter/Pjhoto)
  • Share this:
Pawan Kalyan : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నువ్వా, నేనా అంటూ రాజకీయంగా కలబడుతున్నాయి. ఈ రెండు పార్టీలూ పూర్తి విరుద్ధమైన స్టాండ్ తీసుకున్నాయి. వీటిలాగే బీజేపీ, జనసేన కూడా తమదైన స్టాండ్ తీసుకున్నాయి. బీజేపీ 6 వారాల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్థిస్తే... జనసేన... ఆల్రెడీ అయిన ఏకగ్రీవాల్ని కూడా మళ్లీ నిర్వహించాలని కోరుతోంది. అసలు నామినేషన్ల ప్రక్రియే సరిగా జరగలేదనీ, హింస, దాడులు, దౌర్జన్యాలతో అధికార పార్టీ అభ్యర్థులే నామినేషన్లు వేసేలా చేసుకొని... ఏకగ్రీవం అయినట్లుగా క్రియేట్ చేశారని పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. ఈ విషయంలో మరింత గట్టిగానే పోరాటం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి... బీజేపీ పెద్దల్ని కలిసి... చర్చించనున్నట్లు తెలిసింది. ఐతే... ఢిల్లీ పర్యటన ఎప్పుడన్నది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఓవైపు కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో... అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారని తెలిసింది.

ప్రధానంగా పవన్ కళ్యాణ్... కేంద్ర హోంశాఖను కలిసి... ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవని కంప్లైంట్ చేయబోతున్నారని తెలిసింది. వైసీపీ నాయకులు చేసిన దాడుల్లో బీజేపీ నేతలకు గాయాలయ్యాయని చెప్పబోతున్నట్లు సమాచారం. చాలా చోట్ల నామినేషన్లు వేసిన తర్వాత ఆ పత్రాల్ని వైసిపీ అభ్యర్థులు చించివేశారని కూడా చెప్పబోతున్నారని తెలిసింది. ఈ అంశంపై పవన్ కళ్యాణ్... కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగే టీడీపీ కూడా కోరుతుండటం విశేషం. టీ‌డీపీ కూడా మళ్లీ ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచీ జరిపించాలని కోరుతోంది. ఇది బీజేపీకి కూడా కలిసొచ్చేదే అవుతుందనుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే... ప్రతిపక్షాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీకి వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా కేంద్ర హోంశాఖ... రాష్ట్రంలో శాంతి భద్రతలపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తే... అది వైసీపీకి ఇబ్బందికర పరిణామం అవుతుంది. అలాంటివేవీ జరగవనీ, ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయే తప్ప ఏపీలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యా లేదని పాలకపక్షం వైసీపీ అంటోంది.
First published: March 18, 2020, 6:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading