Home /News /andhra-pradesh /

JANASENA CHIEF PAWAN KALYAN TO GIVE MEMORANDUM TO KRISHNA DISTRICT COLLECTOR ON DECEMBER 28TH HERE IS WHY BA

Pawan Kalyan: కృష్ణా కలెక్టర్‌ను కలవనున్న పవన్ కళ్యాణ్, డేట్ ఫిక్స్

pawan kalyan: పవన్ కళ్యాణ్

pawan kalyan: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలవనున్నారు. ఈనెల 28న ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌ను కలుస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలవనున్నారు. ఈనెల 28న ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌ను కలుస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35వేల పరిహారం ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ.10వేలు సాయం చేయాలని కోరుతూ ఈనెల 28న పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించనున్నారు. నేడు ప్రపంచ రైతుల దినోత్సవం సందర్భంగా రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 28న ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరతారు. గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నం వెళ్తారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తారు. రైతులు, కౌలు రైతుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జనసేన చేపడుతున్న జై కిసాన్ కార్యక్రమంలో భాగంగా అదే రోజున రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో జనసేన నాయకులు ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తారు.’ అని జనసేన అధినేత పవన్ కళ్యాన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

    నివర్ తుఫాన్ బాధితులకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించారు. మొత్తం ఐదు రోజుల పాటు పర్యటన సాగింది. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే రూ.10వేలు సాయం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు రూ.35వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నివర్ తుఫాన్, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేరుగా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పిస్తానని పవన్ ప్రకటించారు. కౌలు రైతుకోసం భూమిదున్నే రైతు కోసమే జనసేన జైకిసాన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

    ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాన్ భావిస్తున్నారు. అందుకే జై కిసాన్ నినాదాన్ని అందుకున్నారు. ఇటీవల ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశారు. రైతులకు ప్రభుత్వం చెబుతున్నది వేరని, వాస్తవంలో జరుగుతున్నది వేరని జనసేన పార్టీ ఆరోపిస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Cyclone Nivar, Janasena party, Krishna District, Pawan kalyan

    తదుపరి వార్తలు