పవన్‌కళ్యాణ్ ప్లానేంటి... నేడు జనసేన పొలిట్‌బ్యూరో మీట్...

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత... దాదాపు 100 రోజులు సైలెంట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్... ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏపీతోపాటూ... తెలంగాణపైనా దృష్టిసారిస్తున్నారు.

news18-telugu
Updated: October 18, 2019, 7:11 AM IST
పవన్‌కళ్యాణ్ ప్లానేంటి... నేడు జనసేన పొలిట్‌బ్యూరో మీట్...
పవన్‌కళ్యాణ్ ప్లానేంటి... నేడు జనసేన పొలిట్‌బ్యూరో మీట్... (file)
news18-telugu
Updated: October 18, 2019, 7:11 AM IST
Andhra Pradesh : ఏపీ ప్రభుత్వానికి 100 రోజులు టైమ్ ఇస్తానన్న జనసేన పవన్ కళ్యాణ్... 100 రోజుల తర్వాత క్రమంగా ప్రభుత్వంపై విమర్శల ధాటిని పెంచుతున్నారు. ఇటీవల రైతు భరోసా కింద ఏపీ ప్రభుత్వం రూ.13,500 ఇస్తున్నట్లు ప్రకటించగానే... పవన్ కళ్యాణ్... రివర్స్ అయ్యారు. కేంద్రం ఇచ్చే నిధులను ఈ స్కీంలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.6000తో కలిపి... మొత్తం రూ.19500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణలో యురేనియం తవ్వకాల్ని వ్యతిరేకించారు. అంతేకాదు... తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపైనా స్పందించిన పవన్ కళ్యాణ్... ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఇలా జనసేన అధినేత క్రమంగా స్పీడ్ పెంచుతున్నారు. ఐతే... ఈ స్పీడ్ చాలదనీ... ముందు పార్టీని క్షేత్రస్థాయి నుంచీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలనే విశ్లేషణలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటి నుంచే మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్... దీనిపై పార్టీ శ్రేణులకు ఆల్రెడీ పిలుపు ఇచ్చారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ... అవి నెరవేరే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు ఉండాలని... పార్టీ నేతలకు సూచించారు. నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న పార్టీ ఆఫీస్‌లో పొలిటి బ్యూరో సమావేశం నిర్వహించబోతున్నారు. దీని తర్వాత 20న ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ రెండింటి ద్వారా... భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్.

సినిమాల్లో రీఎంట్రీపైనా చర్చ : తన జీవితం రాజకీయాలకే అంకితమన్న పవన్ కళ్యాణ్... తిరిగి సినిమాలు చేస్తారనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. మలయాళంలో హిట్టైన లూసిఫర్‌ సినిమాను పవన్‌ కల్యాణ్ హీరోగా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ రీమేక్ సంగతి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దర్శకుడు క్రిష్‌ కూడా ఓ సెంటిమెంటల్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఐతే... దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ స్పందించలేదు. ఇవాళ్టి పొలిట్ బ్యూరో మీటింగ్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్షలు ఎక్కువైపోయాయి. ఒకవేళ పవన్ గనక... సినిమాలు చేస్తానని అంటే మాత్రం... ఆ పార్టీకి మరికొందరు నేతలు గుడ్‌బై చెప్పే ప్రమాదం ఉంటుంది.

 


Pics : యూత్‌ని ఇన్స్‌పైర్ చేస్తున్న అన్వేషి జైన్


Loading...
ఇవి కూడా చదవండి :


Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి


Health Tips : వేరుశనగ గింజలను ఇలా తింటే ఎక్కువ ప్రయోజనాలు

ఇంటికి ఎలాంటి కలర్స్ వేస్తే మంచిది... కలర్స్ ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...