హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan Protest: రైతుల పరిహారం కోసం పవన్ కళ్యాణ్ దీక్ష. కార్యకర్తలకు ఆదేశం

Pawan Kalyan Protest: రైతుల పరిహారం కోసం పవన్ కళ్యాణ్ దీక్ష. కార్యకర్తలకు ఆదేశం

Pawan Kalyan Protest: రైతుల పరిహారం కోసం పవన్ కళ్యాణ్ దీక్ష. కార్యకర్తలకు ఆదేశం (image source - twitter - janasena)

Pawan Kalyan Protest: రైతుల పరిహారం కోసం పవన్ కళ్యాణ్ దీక్ష. కార్యకర్తలకు ఆదేశం (image source - twitter - janasena)

Pawan Kalyan Protest: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్పీడ్ పెంచారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియడంతో... ఇక ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు.

Pawan Kalyan Protest: నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంగా రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... ముందుగా చెప్పినట్లుగానే దీక్షకు దిగారు. పవన్ చేసిన డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతులకు మద్దతుగా ఆయన ఈ రోజు తన ఇంట్లో ఉదయం 10 గంటలకు దీక్షలో కూర్చున్నారు. నివర్ తుఫాన్ వల్ల రైతులు పంటలు నష్టపోయారనీ... తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ అన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసీపీ... ఆ రైతులకే అన్యాయం చేస్తూ ఉంటే... చూస్తూ ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ ఈమధ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో భాగంగానే ఈ దీక్ష చేపట్టారు.

రైతులకు తక్షణ సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడం కోసం, రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాజాగా దీక్షకు దిగిన సందర్భంగా ఆయన... పార్టీ శ్రేణులకు పిలుపుచ్చారు. నష్టపోయిన రైతుల కోసం విరాళాలు గురించి ప్రతి ప్రజా ప్రతినిధిని అడగండి అన్నారు.

రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్న పవన్ కళ్యాణ్... నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడం కోసం, మనో ధైర్యం చెప్పడం కోసం తాను తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఈమధ్య తెలిపారు. మద్యపానం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలని, తక్షణమే సాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించక పోతే ఈ నెల ఏడున నిరసన దీక్ష చేపడతానని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఈ సంవత్సరం మూడోసారి పంట నష్టపోయి ఆవేదన చెందుతున్నారన్న ఆయన.... రైతుల కోసం, భావితరాల భవిష్యత్ కోసం జనసేన పార్టీ పని చేస్తుందని చెప్పారు.


గ్రేటర్ మున్సిపాల్టీ ఎన్నికల్లో బీజేపీ దూకుడును చూసిన పవన్ కళ్యాణ్... ఏపీలో తాము కూడా అలాంటి క్రియాశీలక ప్రతిపక్షంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇకపై ఆయన ప్రజా సమస్యలపై కాస్త దూకుడుగానే ఉంటారని జనసేన వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో జనసేన... GHMC ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసింది కాబట్టి... ఏపీలో ఆ పార్టీ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇకపైనా ఇలాంటి దీక్షలు, ధర్నాల వంటివి చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: AP News, Cyclone Nivar, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు