Pawan fire: జగన్ సర్కార్ పై పవన్ ఫైర్.. రేపటి నుంచి రంగంలోకి జనసేన..

జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఏపీ రాజకీయాల్లో పవన్ దూకుడు పెంచుతున్నారు. ఇంతకాలం సినిమాలంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్.. చాలా గ్యాప్ తరువాత తొలి పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అండగా ఉద్యమ కార్యచరణ రూపొందించారు. రేపటి నుంచి రంగంలోకి దిగుతున్నారు.

 • Share this:
  మ్జ నసేన అధినేత పవన్ దూకుడు పెంచారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఏపీలో రాజకీయాలపై సీరియస్ గానే ఫోకస్ చేశారు. చాలా గ్యాప్ తరువాత ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన.. నేరుగా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అమరావతి రైతులు, నిరుద్యోగులను కలిసిన ఆయన వారి తరపున జనసేన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా.. జగన్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా.. పోరాటం చేయాలని నిర్ణయించారు. రేపు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసుల్లో రెండున్నర లక్షల ఉద్యోగాల హామీని గుర్తు చేస్తూ వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమానికి పవన్ పిలుపు ఇచ్చారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేవరకూ జనసేన అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై పవన్ ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు.

  ఇవాళ జగన్ సీఎం అయ్యారన్నా.. వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నా అందుకు ప్రధాన కారణం రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత అని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో ఓట్లేసి 151 సీట్లు వచ్చేలా గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా నయవంచనకు గురయ్యామని వారంతా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారని.. ఇప్పుడు పది వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఏంటని జనసేనాని ప్రశ్నించారు.

  రెండున్నర లక్షలు ఎక్కడ.. పది వేల ఉద్యోగాలు ఎక్కడని ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు. ముఖ్యంగా పోలీసు శాఖలో 74 వేల ఉద్యోగాలున్నాయని చెప్పారని.. బడ్జెట్‌కి అనుగుణంగా ఏటా 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని.. మరి ఇప్పుడు కేవలం 460 పోస్టులే చూపడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. అసలు ఉపాధ్యాయ ఉద్యోగాల సంగతే మరిచిపోయారా..? గ్రూప్1, 2 ఉద్యోగాలు కేవలం 34 ఏంటని పవన్ ప్రశ్నించారు.

  ఇదీ చదవండి: ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

  ఉద్యోగాలు వస్తాయన్న దేశ వ్యాప్తంగా పలు కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువత శిక్షణ తీసుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యారని.. ఇప్పుడు వాళ్ల పరిస్థితేంటని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు నామినేటెడ్ ఉద్యోగాలిచ్చేందుకు కొత్తకొత్త పదవులు సృష్టించిన వైసీపీ ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలను మాత్రం ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు.
  Published by:Nagesh Paina
  First published: