JANASENA CHIEF PAWAN KALYAN SLAMS ANDHRA PRADESH MPS DO RAISE PLAY CARDS IN PARLIAMENT NGS
Pawan Kalyan: మీ ప్రాణ త్యాగం అవసరం లేదు.. కనీసం ఈ పని చేయండి అంటూ.. ఎంపీలపై పవన్ సెటైర్లు
అంత త్యాగం వద్దు ప్లకార్డులు పట్టుకోండి చాలు
Pawan Kalyan: వైసీపీ ఎంపీలపై పవన్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ ఎంపీలు అంత త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు.. కనీసం ఆ పని చేయండి దమ్ముంటే అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన డిజిటల్ ఉద్యమం చేపట్టింది. ఇందులో భాగంగా పవన్ వైసీపీ ఎంపీల తీరుపై ఇలా మండిపడ్డారు.
Pawan Kalyan Fire: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel plant Privatization) అంశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) ని జనసేన పార్టీ (Janasena Party) టార్గెట్ చేసింది. రెండు పార్టీల ఎంపీలు పార్లమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనత్తడంలో విఫమలయ్యాయంటూ ఆ రెండు పార్టీలపై డిజిటల్ ఉద్యమం కొనసాగిస్తుున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan). ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన పవన్.. ఏపీలో అధికార పార్టీపై మండిపడ్డారు. ఏపీ ఎంపీల తీరుకు నిరసనగా జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ ఉద్యమం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియా జనసేన ట్వీట్లతో మోత మోగింది. విరామం లేకుండా రెండు పార్టీల ఎంపీలను ట్యాగ్ చేస్తున్నా వాళ్లలో చలనం లేకపోవడంతో పవన్ మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు. వివిధ రూపాల్లో తన నిరసన తెలియజేస్తున్నారు. మొదట విశాఖ వెళ్లి నేరుగా ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు. అదే రోజు వైసీపీ సర్కార్ కు రెండు వారల డెడ్ లైన్ పెట్టారు. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మంగళగిరి పార్టీ కార్యాలయంతో ఒక రోజు దీక్ష చేశారు. ప్రస్తుతం డిజిటల్ ఉద్యమం చేపట్టారు జనసేనాని.. దీనిలో భాగంగా తాజాగా ఇదే అంశంపై జనసేనాని స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై మళ్ళీ మండిపడ్డారు.
ఇదీ చదవండి : ఒమిక్రాన్ కు మందు కావాలా? ఈ నెంబర్ కు కాల్ చేయండి.. 15 రోజులకు ఓసారి వాడితే చాలు
వైసీపీ ఎంపీలు ఉక్కు పరిశ్రమ కోసం కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు. అంటూనే వైసీపీ నేతలు విశాఖ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో.. చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని తమ ప్రాణాలను త్యాగం చేసి మరీ అడ్డుకుంటామని అన్నారు.. అయితే మీరు మీ ప్రాణాలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి చాలు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
YSRCP MP లు,
కనీసం ప్లకార్డులు పట్టుకోండి,చాలు.
——————————————
విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ' వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు '.
అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ‘ప్లకార్డులు పట్టుకోండి,చాలు.’#Raise_Placards_YSRCP_MP
విశాఖ ఉక్కు పరిరక్షణకై ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. గత మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు , నేతలు ప్లకార్డులు పట్టుకుని ఈ క్యాంపెయిన్ లో భాగంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఒక్క ఎంపీ కూడా ఉక్కు పరిశ్రమ కోసం ప్లకార్డు పట్టుకొలేదు. దీంతో పవన్ వారి తీరుపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా వైసిపీ ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన మూడు రోజుల పాటు డిజి టల్ క్యాంపెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న ఎంపీలను #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant పేరుతో విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమం చేయాలంటూ హ్యాష్ టాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.