Pawan Kalyan: అంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు కొనసాగుతనే ఉన్నాయి. తాజాగా మరోసారి జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఏపీ ప్రభుత్వం (AP Government)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్. ప్రజలంతా నిత్య చైతన్య మూర్తులై పోరాడాలని.. తెలుగు జాతి ఉనికి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం పొట్టి శ్రీరాముల ప్రాణార్పణతో ఏపీ అవతరించిందని పేర్కొన్నారు. ఆంధ్రుల్లో ఎలాంటి చైతన్యం కోసం అమరజీవి తపించారో ఆ చైతన్యం ఇప్పుడేమైంది..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా ప్రజల్లో ఎందుకు స్పందన కరవైందని ప్రశ్నించారు. ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతోందని.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నా ఎందుకీ మౌనం అంటూ ప్రశ్నించారు.
ప్రజలకు పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా ఎందుకు ఎవరూ ప్రశ్నించడం లేదని ఆవేదన వ్య్తక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం ఏపీ అవతరించిందో ఒక్కసారి.. మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అవతరన దినోత్సవం రోజైనా.. మనం మన రాష్ట్రం గురించి ఏం చేస్తున్నామని ఆలోచించుకోవాలని.. ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు పిడికిలి బిగించి ప్రశ్నించాలని కోరారు.
ఇలా అక్రమార్కులు పాలన చేస్తుంటే చేష్టలుడిగి ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామని నిలదీశారు. ఇలాంటి పర్వదినాన బాధ్యతాయుతమైన పౌరులందరూ మంచి ఆలోచన చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లేలా కార్యాచరణతో ముందుకు సాగాలని కోరారు. ఓటును ఆయుధంగా మలుచుకుని బుద్ధి చెప్పాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను మన దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని కోరారు.
ఇదీ చదవండి : అమరావతి రైతులకు బిగ్ షాక్.. పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
మరోవైపు పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి నేరుగా ప్రజల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా ఉమ్మడి అజెండా రూపొందిస్తున్నట్టు ప్రచారం.. ప్రజా వ్యతిరేక విధానాలపై.. తెలుగు దేశం పార్టీతో కలిసి.. పోరాడాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పోరాటం ఎలా ఉండాలి..? ఏఏ అంశాలపై ఎలాంటి పోరాటాలు చేయాలి.. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి.. ఇలా పలు అంశాలపై కరస్తతు చేస్తున్న్టుట తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే.. ఈ నెల రెండో వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి.. అమిత్ షా లేదా ప్రధానిని కలిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Pawan kalyan