హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan on Chandrababu: చంద్రబాబు తూర్పుగోదావరి పర్యటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Pawan on Chandrababu: చంద్రబాబు తూర్పుగోదావరి పర్యటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

పవన్ కళ్యాణ్ (File Photo)

పవన్ కళ్యాణ్ (File Photo)

Pawan on Chandrababu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగింది అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

Pawan on Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష నేతల పర్యటనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. తాజాగా చంద్రబాబు (Chandrababu) తూర్పు గోదావరి జిల్లా  (East Godavari District) పర్యటనలో టెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఘాటుగా స్పందించారు. బలభద్రపురం దగ్గర చంద్రబాబు కాన్వాయ్ ఎదురుగా పోలీసులు రోడ్డుపై అడ్డంగా కూర్చని అడ్డుపడ్డ తీరును.. ఆయన తప్పు పట్టారు. సాధారణంగా ఎవరైనా గొడవలు చేస్తే.. పోలీసులు వారిని అడ్డుకోవాలి.. రాజకీయ నేతల పర్యటనలకు రక్షణ కల్పించాలి.. కానీ ఇక్కడ పోలీసులే ఇలా రోడ్డుపై బైఠాయించడాన్ని వైసీపీ పాలనలోనే చూస్తున్నామని పవన్ ఫైర్ అయ్యారు.

చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది.. ప్రతిపక్ష నేత కూడా.. అలా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తికి.. పార్టీ అధినేతగా పర్యటనకు వెళ్లే హక్కు ఆయనకు లేదా అని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని ఎలా అడ్డుకుంటారని పవన్ ప్రశ్నించారు. సాధారణంగా ప్రజలు నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయిస్తుంటారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులే రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

తాను గతంలో జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళితే లైట్లు ఆపేశారు. హోటల్ లోనే నిర్బంధం చేశారన్నారు. ఇప్పటంలోనూ అడ్డుకున్నారని. కూల్చివేత బాధితులను పరామర్శించేందుకు వెళితే నడవకూడదని ఆంక్షలు విధించారని. విపక్షం గొంతుక వినిపిస్తే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు అన్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి : కన్నా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. తాజా ఆరోపణలపై ఏమన్నారంటే..?

ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏమాత్రం గౌరవం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వంటి పదాలకు ఈ ప్రభుత్వానికి అర్థం తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబును అడ్డుకున్న తీరు నియంతృత్వ ధోరణులకు నిదర్శనం అని విమర్శించారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన చేశారు.

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసిపోతాయి.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అసలు అనపర్తిలో ఏం జరిగింది అంటే..? అనపర్తి సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సభకు వెళ్తున్న చంద్రబాబును బిక్కవోలు దగ్గరే నిలిపివేయడానికి ప్రయత్నించారు. చంద్రబాబు కాన్వాయ్ కు బారికేడ్లు అడ్డంగా పెట్టగా.. వాటిని టీడీపీ కార్యకర్తలు తోసివేయడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలింది. బలభద్రపురం దగ్గర మరోసారి చంద్రబాబును అడ్డుకున్నారు పోలీసులు. పోలీస్ బస్సుని అడ్డంగా పెట్టి చంద్రబాబు కాన్వాయ్ ని నిలిపివేశారు. ఎంతసేపటికి పోలీసులు రోడ్డును క్లియర్ చేయకపోవడంతో కాన్వాయ్ దిగిన చంద్రబాబు కాలినడకన ముందుకు సాగారు. పార్టీ శ్రేణులు సైతం చంద్రబాబు వెంట నడిచాయి.

ఇదీ చదవండి : బ్రహ్మ ప్రతిష్టించిన శివాలయం గురించి తెలుసా..? శివరాత్రి రోజు దర్శించుకుంటే ఏ కోరికైనా తీరినట్టే..

చంద్రబాబు అనపర్తి పర్యటనకు కలెక్టర్, ఎస్పీ నిన్ననే అనుమతి ఇచ్చారు. అయితే, సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఇవాళ పోలీసులు నోటీసులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ నోటీసులపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. అనపర్తిలోనూ టీడీపీ సభకు కార్యకర్తలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ, వాటిని తోసుకుని టీడీపీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి వెళ్లారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Chandrababu Naidu, Janasena, Pawan kalyan