హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan on AP DGP: అందుకేనా డీజీపీ బదిలీ..? సవాంగ్ ఇష్యూపై పవన్ షాకింగ్ కామెంట్స్.. కరివేపాకుతో పోల్చిన టీడీపీ

Pawan on AP DGP: అందుకేనా డీజీపీ బదిలీ..? సవాంగ్ ఇష్యూపై పవన్ షాకింగ్ కామెంట్స్.. కరివేపాకుతో పోల్చిన టీడీపీ

డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautham Sawang) ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి సవాంగ్ ను బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautham Sawang) ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి సవాంగ్ ను బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautham Sawang) ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి సవాంగ్ ను బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

  డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautham Sawang) ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఉన్నట్లుండి సవాంగ్ ను బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సవాంగ్ కు కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా సవాంగ్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాజా జనసేన అధ్యక్షుడు గౌతమ్ సవాంగ్ డీజీపీ బదిలీపై స్పందించారు. గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఏపీ డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారని.., ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

  అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చని.., కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో..? చెప్పాలన్నారు పవన్. ఇందుకుగల కారణాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టతనివ్వని పక్షంలో విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందన్నారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి.. అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందన్నారు.

  ఇది చదవండి: గౌతమ్ సవాంగ్ బదిలీకి ప్రధాన కారణం ఇదేనా.. అందుకే నిర్ణయం తీసుకున్నారా..?


  కరివేపాకులా తీసిపరేశారు: టీడీపీ

  గౌతమ్ సవాంగ్ బదిలీపై టీడీపీ కూడా రియాక్ట్ అయింది. సవాంగ్ ను సీఎం జగన్ వాడుకొని ఆ తర్వాత కరివేపాకులో తీసిపారేశారని టీడీపీ నేత వర్లరామయ్య ఎద్దేవా చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ని, పోలీస్ మాన్యువల్ ని కాదని సీఎం జగన్ ఎవరిపైకేసుపెట్టమంటే, వారిపైపెట్టి, ఎగెరిగిరి పడిన గౌతమ్ సవాంగ్ కు ఇప్పుడు శృంగభంగమే మిగిలిందని వర్లరామయ్య అన్నారు. తనపదవీకాలం ముగిసేవరకు డీజీపీగానే ఉంటానని భావించిన వ్యక్తిక5 చివరకు పోస్టింగ్ కూడాలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఇలాఅవసరానికి వాడుకొని, తరువాత అధికారులకు అవమా నాలు, హేళనలు మిగల్చడం జగన్మోహన్ రెడ్డికి కొత్తేమీకాదన్న వర్ల రామయ్య.. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజయ్ కల్లం, నిన్న ప్రవీణ్ ప్రకాష్, నేడు సవాంగ్ విషయంలో అది వెల్లడైందన్నారు. ముఖ్య మంత్రి యూజ్ అండ్ త్రో చీఫ్ మినిస్టర్ అని తెలుసుకోవాలన్నారు.

  ఇది చదవండి: సీఎం జగన్ తో నందమూరి కుటుంబం భేటీ.. టీడీపీకి ఇలా చెక్ పెట్టిన కొడాలి నాని


  మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది. సవాంగ్ బదిలీకి ఉద్యోగుల ఉద్యమం కారణమా..? లేక ఆయనే కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు బదిలీ కోరారా..? లేక సాధారణ బదిలీలో భాగంగానే జరిగిందా..? అనేది తేలాల్సి ఉంది.

  First published:

  Tags: Andhra Pradesh, AP DGP, Gautam Sawang, Pawan kalyan

  ఉత్తమ కథలు