హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు..? 28 మంది వైసిపీ ఎంపీలు సభలో ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్న

Pawan Kalyan: పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు..? 28 మంది వైసిపీ ఎంపీలు సభలో ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్న

Pawan Kalyan On Polavaram: తాజాగా యూనియన్ బడ్జెట్ 2022-2023లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొదట బీజేపీ మిత్రపక్షంగా బడ్జెట్ బాగుంది అంటూ స్పందించిన పవన్.. ఇవాళ అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 28 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

  Pawan Kalyan On Polavaram: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన యూనియన్ బడ్జెట్ పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ను బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచించింది. అందకే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు బడ్జెట్ పై పెదవి విరుస్తున్నాయి. అసలు విభజన హామీల ప్రస్తావన లేకపోవడం.. రైల్వే జోన్ పూర్తిగా పట్టించుకోలేదు. విద్యాసంస్థలకు నిధులు విడుదల చేయలేదు.. రాష్ట్రం ప్రభుత్వంతో సహా.. నిపుణులు చెప్పిన సూచనలు ఒక్కటికూడా కేంద్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరానికి సైతం నిధులు విడుదల చేయకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. మన 28 ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 28 మంది ఎంపీలతో వైసీపీ ప్రభుత్వం సాధించింది శూన్యమని.. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. 22మంది వైసీపీ ఎంపీలు, ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లని నిలదీశారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా లేదా అనే సందేహం కలుగుతోంది అన్నారు.

  సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఢిల్లీ (Delhi) పర్యటన ప్రకటన సమయంలో పోలవరం గురించి అడిగామని అంటారు.. అయితే కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే కనిపించడం లేదని.. వైసీపీ ప్రభుతం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం 5163.2 కోట్ల రూపాయలు మాత్రమేనని గుర్తు చేశారు. ఇలా అయితే ఎప్పటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని ప్రశ్నించారు. యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం 44 వేల కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఈ సారి కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి. దీని బట్టి చూస్తే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులను కేటాయిస్తోంది. దీని బట్టి చూస్తుంటే.. పోలవరం కు నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేనాని వ్యాఖ్యానించారు.

  కేంద్రం దగ్గర తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను పక్కన పెడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా బహుళార్ధ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని పవన్ విమర్శించారు.

  ఇదీ చదవండి : నిఘా నీడలో విజయవాడ.. పీఆర్సీ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు.. కఠిన ఆంక్షలు

  పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచనా వ్యయం 47,725 కోట్ల రూపాయల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pawan kalyan, Polavaram, Union Budget 2022

  ఉత్తమ కథలు