JANASENA CHIEF PAWAN KALYAN PLAYING NEW STRATEGY ON ALLIANCE WITH TDP FOR 2024ASSEMBLY ELECTIONS FULL DETAILS HERE PRN
Pawan Kalyan: ఆ నేతల మీటింగ్ తర్వాత పవన్ వ్యూహం మార్చారా..? అందుకే ఆ కామెంట్స్ చేశారా..?
పవన్ కల్యాణ్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన పార్టీ (Janasena Party) కి ప్రత్యేక స్థానముంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన పార్టీ (Janasena Party) కి ప్రత్యేక స్థానముంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసింది. దాదాపు 40 సీట్లలో జనసేన వల్లే ఫలితాలు రివర్స్ అయ్యాయనేది విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుకోసం టీడీపీ తహతహలాడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఓ దశలో పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కల్యాణ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ లో కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు పలువురు ముఖ్యనేతల హాజరయ్యారు. ఈ సమావేశంలో కాపు నేతను ముఖ్యమంత్రిని చేయాలని తీర్మానించుకున్నారట. ఈ లిస్టులో పవన్ కల్యాణ్ లేదా బీజేపీ నుంచి అభ్యర్థి లేదా కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా వచ్చిందట. అటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా కాపులకు రాజ్యాధికారం రావాలంటూ బీసీ, ఎస్సీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై పవన్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ తో ఉన్న ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తూ కాపు నేతలను కలుపుకుపోతేనే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి సమీకరణాలు, అప్పటి పరిస్థితులను బట్టి టీడీపీతో పొత్తుకు గురించి ఆలోచించవచ్చని పవన్ భావిస్తున్నారట. 2014లో టీడీపీకి మద్దతిచ్చి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించిన పవన్.. ఎప్పుడైతే తెలుగుదేశంతో విభేదించారో.. ఆ తర్వాత ఆ పార్టీ నేతలు పవన్ పై దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు నుంచి లోకల్ లీడర్ వరకు పవన్ కల్యాణ్ ను విమర్శించిన వారే. ఇక సోషల్ మీడియాలోనూ ఇదే రకంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో పవన్ అభిమానులు టీడీపీపై రగిలిపోయారు.
ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటే కార్యకర్తలు, ఫ్యాన్స్ అంగీకరించే పరిస్థితి లేదు. అంతేకాదు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ ఎలా సీఎం అవుతారని కూడా కొందరు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఐతే ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా పొత్తులపై కార్యకర్తల అభీష్టం మేరకే ముందుకెళ్తామని పవన్ ప్రకటించడంతో టీడీపీతో కలిసి వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.