హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కారణమేంటి..? పవన్ ఏమన్నారంటే..?

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కారణమేంటి..? పవన్ ఏమన్నారంటే..?

తెలుగు రాష్ట్రాల జల వివాదం పై స్పందించిన పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాల జల వివాదం పై స్పందించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కారణం ఏంటి..? రెండు రాష్ట్రాల మధ్య జల జగడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి..? ఇంతకాలం సైలెంట్ గా ఉన్నా.. పవన్ తొలిసారి ఈ వివాదంపై స్పందించారు..

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరింది. రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. అటు తెలంగాణ మంత్రులు.. ఇటు ఏపీ మంత్రులు ఢీ అంటే ఢీ అంటున్నారు. సీఎం జగన్ సైతం ఇదే అంశంపై ప్రధాని మోదీకి పదే పదే లేఖలు రాస్తున్నారు. అయితే ఈ జల జగడంపై జనసేన అధినేత స్టాండ్ ఏంటి..? ఆయన ఏం చెబుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ అమరావతిలో పర్యటించిన ఆయన రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వివాదం నమ్మశక్యంగా లేదన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు లక్షల్లో ఉద్యోగాలు అని చెప్పి కేవలం మూడు వేల ఉద్యోగాలు ప్రకటించారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతకి అండగా జనసేన పార్టీ ఉంటుందన్నారు. దీనిపై త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో జనసేన గెలిచే విధంగా ప్రణాళికలు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. బూతులు తిట్టే నేతలు ఉంటే సమాజం ఎటు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి చేసి పథకాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నమ్మశక్యంగా లేదని, సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. ఇద్దరు సీఎంలు చాలా సఖ్యతగా ఉంటున్నామని ప్రకటించారని, మరి వివాదాలు ఎందుకు వస్తున్నాయని పవన్ ప్రశ్నించారు. ఈ వివాదం రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందన్నారు. కులాలని పైకి తీసుకురావడం అంటే కార్పొరేషన్‌లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నారు. అధికారం లేని కులాలకు అధికారం తెచ్చే విధంగా జనసేన పని చేస్తుందన్నారు, దానిని సాధిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌కి షర్మిల.. రేపు తెలంగాణ పార్టీ జెండా.. అజెండా ఆవిష్కరణ

అంతకముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తాడేపల్లి కరకట్ట వాసులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... సీఎం భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా?ఆడపడుచులను పచ్చి బూతులు తిడతారా? అని ప్రశ్నించారు. సీఎం ఇంటి‌చుట్టూ ఉన్నవారికే రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడరని చెప్పారు. ఖాళీ చేయించడం తప్పని సరైతే...వారికి ముందు న్యాయం చేయాలని సూచించారు. 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే వారిని తరలించాలన్నారు. మొండిగా ముందుకెళ్తే జనసేన ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan, Water dispute

ఉత్తమ కథలు