JANASENA CHIEF PAWAN KALYAN MADE INTERESTING COMMENTS ON ALLIANCE POLITICS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Pawan on Alliance: పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు.. 2024లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామన్న జనసేనాని
పవన్ కల్యాణ్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల బాగా చర్చనీయాంశమవుతున్న అంశం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena Party) ఎవరితో పొత్తుపెట్టుకోబోతుందన్నది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పొత్తుపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబ నాయుడు (Nara Chandra Babu Naidu) వన్ సైడ్ లవ్ కామెంట్స్ చేసిన తర్వాత రెండు పార్టీల స్నేహం హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల బాగా చర్చనీయాంశమవుతున్న అంశం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena Party) ఎవరితో పొత్తుపెట్టుకోబోతుందన్నది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పొత్తుపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) వన్ సైడ్ లవ్ కామెంట్స్ చేసిన తర్వాత రెండు పార్టీల స్నేహం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పొత్తు రాజకీయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేసిన ఆయన.. ప్రతి జనసేన కార్యకర్త అభిప్రాయాల మేరకే ముందుకెళ్తామన్నారు.
ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న అంశాన్ని గుర్తుచేసిన పవన్.. పొత్తు అంశాన్ని పార్టీ కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే 2024 ఎన్నికల్లో ఎవరితో కలిసి బరిలో దిగాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పలు పార్టీలు జనసేనతో పొత్తుకు ముందుకొస్తాయన్న పవన్.. ఇతర పార్టీలు ఆడే మైండ్ గేమ్ లో జనసైనికులు పావులుగా మారవద్దన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకుంటోందని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలన్నారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బూత్ కమిటీల నియామకాలను పూర్తి చేస్తామన్న ఆయన.. జనసైనికులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇక కరోనా కారణంగా గత ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోలేకపోయామన్న పవన్.. ఈసారి మార్చి 14న ఆవిర్భావ నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆవిర్భావ సభలో 2024 ఎన్నికలకు ఒక సన్నద్ధతగా ఉండాలన్నారు. సంక్రాంతి తర్వాత మరోసారి పార్టీ నేతలతో భేటీ అవుతానని తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం జనసేన పార్టీ.. బీజేపీతో పొత్తులో ఉంది. రెండు పార్టీలు దాదాపు రెండేళ్లుగా కలిసున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఉమ్మడి కార్యాచరణను అమలు చేయడం లేదు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీలు టీడీపీతో కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇటీవల టీడీపీ చీఫ్ చంద్రబాబు కుప్పం టూర్ సందర్భంగా పవన్ తో పొత్తు అంశాన్ని కార్యకర్తలు లేవన్నతగా.. టూ సైడ్ లవ్ ఉంటేనే సాధ్యమవుతుందని పరోక్షంగా జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐతే మెజారిటీ జనసైనికులు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీతో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఓడినా, గెలిచినా బీజేపీతో కలిసి ముందుకెళ్లాలని జనసేన కార్యకర్తలు కోరుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.