తెలంగాణపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రచించిన 'మన సినిమాలు' పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.

news18-telugu
Updated: August 13, 2019, 9:55 PM IST
తెలంగాణపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ (ఫైట్ ఫొటో)
  • Share this:
తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వెల్లడించారు. ఇష్టంతోనే తెలంగాణ గురించి మాట్లడతాను తప్ప రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ తన రక్తం, గుండెల్లో ఉందని తెలిపారు జనసేనాని. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రచించిన 'మన సినిమాలు' పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ప్రపంచాన్ని శాసించే ఎన్నో మంచి సినిమాలు టాలీవుడ్ నుంచి వస్తాయని అభిప్రాయపడ్డారు పవన్.

రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే తెలుగు సినిమాలు వస్తాయి. మహానటి లాంటి సినిమాలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. నాకు తెలంగాణ అంటే ఎంతగానో ఇష్టం. తెలంగాణ గురించి ఇష్టంతోనే మాట్లాడతా. రాజకీయాల కోసం కాదు. తెలంగాణ తన రక్తం, గుండెల్లో ఉంది.
పవన్ కల్యాణ్


మన సినిమాలు పుస్తకావిష్కరణలో పవన్


హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగిన 'మన సినిమాలు' పుస్తకావిష్కరణ సభలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో తనికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ, రావి కొండలరావు, సుద్దాల అశోక్‌ తేజ పాల్గొన్నారు.
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...