• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • JANASENA CHIEF PAWAN KALYAN IS A IT DEGREE HOLDER SAYS MEGA BROTHER NAGABABU BA

పవన్ కళ్యాణ్ విద్యార్హతపై కొత్త విషయం చెప్పిన నాగబాబు

పవన్ కళ్యాణ్ విద్యార్హతపై కొత్త విషయం చెప్పిన నాగబాబు

పవన్ కళ్యాణ్ , నాగబాబు(ఫైల్ ఫోటో) (Source: Twitter)

చదువే సర్వస్వం అనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలని నాగబాబు సూచించారు. ఇతరరంగాలు కూడా ఉన్నాయన్న భావన విద్యార్థుల్లో కలిగించాలన్నారు.

  • Share this:
    పవన్ కళ్యాణ్ చదువు విషయంలో జనసేన చీఫ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. తాను పదో తరగతి మాత్రమే పూర్తి చేశానని ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ ఐటీ డిగ్రీ హోల్డర్ అని చెప్పారు మెగాబ్రదర్ నాగబాబు. ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ కూడా ఏడంతస్తుల భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన నాగబాబు.. అసలు చదువే జీవితం కాదనే విషయాన్ని వివరించారు. ఆయన నిర్వహించే యూట్యూబ్ ఛానల్‌లో ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో మెగా ఫ్యామిలీలో ఎవరెవరు ఏమేం చదువుకున్నారో చెప్పారు.

    ‘చదువు విషయంలో మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. మా అమ్మ కొంచెం అడిగేది. మేం ఖాళీగా ఉన్నప్పుడు చదువుకున్నాం. చిరంజీవి గారు డిగ్రీ పాస్ అయ్యారు. నేను ఎల్‌ఎల్‌బీ చదివా. మద్రాస్ బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేయించుకున్నా. ఒక చెల్లి ఎంబీబీఎస్ చదివింది. ఇంకో చెల్లి డిగ్రీ చదివింది. కళ్యాణ్ బాబు ఇంటర్మీడియట్ కాకుండా కొన్ని ఐటీ సబ్జెక్ట్స్ పూర్తి చేశాడు. ఐటీ డిగ్రీ హోల్డర్ అతను.’ అని నాగబాబు అన్నారు.

    తెలుగు రాష్ట్రాల్లో చదవలేకపోయాననే బాధతో ఒక్క బిడ్డ చనిపోయినా అవమానమే అని నాగబాబు అన్నారు. చదువే సర్వస్వం అనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలని నాగబాబు సూచించారు. ఇతరరంగాలు కూడా ఉన్నాయన్న భావన విద్యార్థుల్లో కలిగించాలన్నారు.
    First published:

    అగ్ర కథనాలు