హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Real Hero Pawan: మరోసారి పెద్దమనసు చూపించిన పవన్.. బీమా లేకపోయినా 5 లక్షల సాయం చేసిన భీమ్లా నాయక్

Real Hero Pawan: మరోసారి పెద్దమనసు చూపించిన పవన్.. బీమా లేకపోయినా 5 లక్షల సాయం చేసిన భీమ్లా నాయక్

Real Hero Pawan: టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో పవన్‌కళ్యాణ్‌ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం మరింత అభిమానులను పెంచేలా చేస్తోంది. తాజాగా మరోసారి ఆయన తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. తనను అభిమానించే వారిపై తనకు ఉన్న ప్రేమ ఏంటో నిరూపించారు.

ఇంకా చదవండి ...

  Real Hero Pawan: తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్. ఆయన చేసే సినిమాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కారణంగానూ అభిమానులు ఆయన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. ప్రేమించడం కాదు.. పవన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనేంత పిచ్చి అభిమానం చూపిస్తారు. పవన్ సైతం వ్యక్తిగతంగా, రాజకీయంగా తాను ఎన్నో సందర్భాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేష్ జనసేన కార్యకర్తగా పార్టీ పెట్టినప్పటి నుంచి కొనసాగుతున్నారు. అయితే అతడు ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకటేష్ మరణవార్తను ఆ జిల్లా జనసేన నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చలించిపోయి ఆర్థిక సాయం ప్రకటించారు.

  సాధారణంగా అన్ని పార్టీలు తమ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇక జనసేన కార్యకర్తలకు కూడా పార్టీ ఇటీవల క్రియాశీలక సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పించింది. దాంతో ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు బీమా సొమ్ము లభిస్తుంది. అయితే తవిటి కొన్ని కారణాల కారణంగా వెంకటేష్ పార్టీ తరఫున బీమా చేయించుకోలేదు. ఆ విషయం తెలియడంతో.. పవన్ కల్యాణ్ ఔదార్యం ప్రదర్శించారు. వెంకటేష్‌కు బీమా లేకపోయినా అతడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే చెక్కును అతడి కుటుంబ సభ్యులకు అందించనున్నారు.

  జనసేన పార్టీలో మొదటి నుంచి నిబద్ధత కలిగిన కార్యకర్త(activist)గా సేవలందించిన వెంకటేశ్ కు సహాయం అందించాలని తలచారు. అయితే ఇలా సాయం చేయడం పవన్ కు కొత్త కాదు.. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ భారీ బ్యానర్‌ను కడుతూ విద్యదాఘాతానికి గురై మరణించిన ముగ్గురు అభిమానుల కుటుంబాలను ఆదుకోవడానికి, భారీగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ముందుగా ప్రకటించిన రెండు లక్షల రూపాయల మొత్తాన్ని భారీగా పెంచి, ఒక్కో కుటుంబానికి 12.5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించారు. జనసేన పార్టీ అంతా ఓ కుటుంబంలా ఉంటుందని, ఎవరికి ఇబ్బంది వచ్చినా స్పందిస్తుందని పేర్కొందని పార్టీ కార్యాలయం పేర్కొంది.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bheemla Nayak, East godavari, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు