Home /News /andhra-pradesh /

JANASENA CHIEF PAWAN KALYAN GAVE CLARITY ON ALLIANCE WITH TELUGU DESAM PARTY NGS

Pawan Kalyan: టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్..! చర్చలు అవసరం ఉందన్న పవన్.. బీజేపీ పైనా క్లారిటీ? ఏమన్నారంటే?

పొత్తులపై పవన్ క్లారిటీ

పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan: ఇటీవల పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం అన్నారు. తాజాగా దానిపై పవన్ స్పందించారు.. పొత్తుల విషయంలో చర్చలు అవసరం అన్నారు.. అంటే రెండు పార్టీల అధినేతలకు పొత్తులకు సై అన్నారు. ప్రస్తుతానికి బీజేపీ నైనై అంటోంది... జాతీయ పార్టీ స్టాండ్ పైనా పవన్ క్లారిటీ ఇచ్చారు..? ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
    Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు రాజకీయ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చేలానే కనిపిస్తున్నాయి. శనివారం సజ్జల (Sajjala) సైతం అదే సంకేతం ఇచ్చారు. అవసరమైతే ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. దీంతో విపక్షాలు మరింత దూకుడు పెంచాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జిల్లాల పర్యటనలో ఉన్నారు. బాదుడే బాదుడు పేరుతో.. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అన్ని పార్టీలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే రాష్ట్రం రావణకాష్టంగా మారుతందన్నారు. అన్ని పార్టీలు ముందుకు వస్తే.. తాను నాయకత్వం వహిస్తాను అన్నారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధం అని పిలుపు ఇచ్చారు.. తాజాగా జనసేన (Janasena) చీఫ్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సైతం దానిపై స్పందించారు.. చంద్రబాబు వ్యాఖ్యలకు అనుకూలంగా స్పందించారు.. రాష్ట్రాన్ని కాపాడడానికి పొత్తుల అవసరం ఉందన్నారు. అయితే ముందు చర్చలు జరగాల్సిన అసవరం ఉందని అభిప్రాయ పడ్డారు.. అంతేకాదు బీజేపీ (BJP) తో పొత్తుపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు..

    రాష్ట్రాన్ని కాపాడడానికి పొత్తుల అవసరం చాలా ఉంది అన్నారు పవన్ కళ్యాణ్.. తాను ఎప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకోలేదు అన్నారు. వైసీపీని ఓడించకపోతే.. రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది అన్నారు. అయితే పొత్తుల విషయంలో చర్చలు అవసరం అననారు. పొరపాటున వైసీపీ అధికారంలోకి రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుంది. ఓట్లు చీలిపోతే వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. అందుకు చాలా పార్టీలు కలిసి రావాలి అన్నారు. ప్రస్తుతం తనకు బీజేపీతో పొత్తు ఉందన్నారు. తమ మధ్య సన్నిహిత్యం కూడా చాలా బలంగానే ఉందన్నారు. అలాగే మోదీ, అమిత్ షాలపై గౌరవం ఉందన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ పై సరైన సందర్భంలో స్పందింస్తాను అన్నారు.

    ఇదీ చదవండి : చిరకాల మిత్రుడికి ఆత్మీయ వీడ్కోలు.. బొజ్జల పాడె మోసిన చంద్రబాబు

    తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే.. చంద్రబాబకు దగ్గరగానే ఉన్నాయి. టీడీపీతో కలిసి వెళ్లే ఆలోచనలోనే ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో బీజేపీ ఇప్పుస్తానని నమ్మకంతో ఆయన ఉన్నట్టు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ వర్షెన్ వేరేలా ఉంది.. చంద్రబాబు త్యాగాలను గతంలో చాలాసార్లు చూశామని.. అయినా కుటుంబ పార్టీలు.. అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు..

    ఇదీ చదవండి : : సర్వ రోగాలను దూరం చేసే పండు.. అంతేకాదు రైతులకు కాసుల వర్షమే.. ఎలా సాగు చేయాలంటే?

    చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే పొత్తుకు ఆహ్వానిస్తున్నారు.. బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తు ప్రసక్తే లేదన్నారు. పవన్ మాత్రం ప్రస్తుతం వైసీపీ అరాచక పాలనను అంతమెందించాలి అంటే.. అన్ని పార్టీలు ముందుకు రావాలంటున్నారు.  బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి అంటున్నారు. దీంతో పవన్ బీజేపీని పొత్తుకు ఒప్పిస్తారా.. లేక.. బీజేపీని విడిచి టీడీపీతో వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Janasena, Pawan kalyan, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు