Home /News /andhra-pradesh /

JANASENA CHIEF PAWAN KALYAN GAVE CLARITY ON ALLAINCE WITH TELUGU DESAM PARTY NGS

Pawan Kalyan: జనసేన టీడీపీ పొత్తుపై ట్విస్ట్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచిన పవన్ కళ్యాణ్ కామెంట్స్

సోము వీర్రాజు, పవన్ కల్యాణ్, చంద్రబాబు (ఫైల్)

సోము వీర్రాజు, పవన్ కల్యాణ్, చంద్రబాబు (ఫైల్)

Pawan Kalyan: ఏపీలో పొత్తులు ఉంటాయా ఉండవా..? తెలుగు దేశం పార్టీ.. భారతీయ జనాతా పార్టీ రెండింటిలో ఏ పార్టీతో జనసేన వచ్చే ఎన్నికలకు వెళ్తుంది. లేక మూడు పార్టీలు కలిసి పొత్తుతో వెళ్తాయా..? ఇలా చర్చ జరుగుతున్న సమయంలో.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
    Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) ప్రస్తుతం పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార వైసీపీ (YCP) అయితే సింగిల్ గానే ఎన్నికలకు సిద్ధమైంది.. కానీ విపక్షాలు పొత్తులతోనే బరిలో దిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.  గత నెల వరకు.. ఇటు తెలుగు దేశం (Telugu desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరూ పొత్తుకు సిద్ధం అనే అర్థం వచ్చేలానే వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఓడించడం కోసం.. ఏపీ భవిష్యత్తు కోసం ఒక మెట్టు తగ్గినా తప్పులేదు అని చెబుతూ వచ్చారు.. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఇప్పుడు రెండు పార్టీల అధినేతల స్వరం మారింది. పొత్తులపై మాట మారుస్తున్నారు. దీంతో అసలు పొత్తు ఉండడం డౌటా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ మరింత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. పొత్తు వార్తల్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. కౌలు రైతులకు సాయం అందించిన ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఎన్ దత్తపుత్రుడిని కాదన్న పవన్.. సీఎం జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని విమర్శించారు. ఈ సందర్భంగా పొత్తులపై క్లారిటీ ఇచ్చారు కూడా..

    ప్రస్తుతం తనకు ఎవరితోనూ పొత్తులు లేవని, ప్రజలతోనే పొత్తులు ఉంటాయని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో జనసేన రైతు భరోసా సభలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ చెక్కులు పంపిణీ చేసారు. 2019 లో వైసీపీని(YCP) నమ్మిన ప్రజలు.. ప్రస్తుతం నమ్మే పరిస్థితిలో లేరని అభిప్రాయపడ్డారు.

    ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిన జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత పెరిగింది అన్నారు. 2014 లోనే పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తనన్ను దత్తపుత్రుడు అంటే నేను ఫీల్ అవను. కానీ ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా సీబీఐ దర్యాప్తును ఎదుర్కోవాలన్నారు. తనను నమ్మమని ఎవరికీ చెప్పడం లేదన్నారు.



    తాను చెప్పింది ఆలోచించమని మాత్రం కోరుతున్నాను అన్నారు. ఇప్పటి వరకు పరిపాలనను చూసిన ప్రజలు.. ఒక్కసారి జనసేన వైపు చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. ప్రజల ఆశీర్వచనాలు తనకు కావాలి అన్నారు. ప్రస్తుతం పొత్తుల కోసం మాట్లాడే సమయం కాదన్నారు. అయితే తన పొత్తులు జనంతోనే అని స్పష్టం చేశారు. దసరా నవరాత్రుల తరువాత రోడ్లపైకి వస్తామని.. ప్రజా సమస్యలపై పోరాడతాం.. వైసీపీ నేతలను పరుగులు పెట్టిస్తామని ఘాటుగా విమర్శించారు పవన్ కళ్యాణ్..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు