హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: ఆ నియోజకవర్గంపై పవన్ ఫోకస్ చేస్తున్నారా..? కారణం ఏంటి..?

Pawan Kalyan: ఆ నియోజకవర్గంపై పవన్ ఫోకస్ చేస్తున్నారా..? కారణం ఏంటి..?

పొత్తులపై క్లారిటీ

పొత్తులపై క్లారిటీ

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాలేదు.. ప్రస్తుతం సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారు.. కానీ పార్టీ అవిర్భావ దినోత్సం నుంచి పూర్తి యాక్టివ్ అవుతారని.. ప్రజల్లోనే ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితు ముందుగా ఆయన ఆ నియోజకర్గంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారట.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Machilipatnam, India

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అన్ని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలతో దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam ) తో పోలిస్తే.. జనసేన (Janasena) వెనుకబడింది అనే చెప్పాలి.. అందుకు కారణం అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పూర్తిగా రాజకీయాలకు అంకితం అవ్వడం లేదు.. సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఆయన రాజకీయాల వైపు చూస్తున్నారనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 14 తరువాత పూర్తిగా యాక్టివ్ అవుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు జనసేన ఆవిర్భావ సభ ఉంది.. ఆ రోజు నుంచి వచ్చే ఎన్నికలపై స్పష్టమైన ప్రకటనలు చేస్తారని.. మేనిఫెస్టో.. పొత్తులపైనా క్లారిటీ ఇస్తారని.. అప్పటి నుంచి ఇక జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారని జనసైనికులు చెబుతున్న మాట.. అయితే ముందుగా ఆయన ఆ నియోజకవర్గంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తన్నారట.. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అక్కడ గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారట.. ఎందుకో తెలుసా..?

ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి అనుకుంటోంది జనసేన. ఏపీలో ఎన్నికల హీట్‌ పెరిగిన క్రమంలో.. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్‌లో ఉన్న తరుణంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం పొలిటికల్‌ టెంపరేచర్‌ను మరింత పెంచేలా చేస్తోంది. ఆ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

తాజాగా జరుగుతున్న పరిణామాలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. కొన్ని సందర్భాల్లో టీడీపీ-జనసేన దగ్గరవుతున్నట్టు.. మరో సమయంలో గ్యాప్‌ పెరుగుతున్నట్టు అభిప్రాయం వ్యక్తమవోతోంది.. పవన్‌ కూడా గతంలో మాదిరి కాకుండా బీజేపీపై కొంత సాఫ్ట్‌గానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ అడుగులు ఎటు వేస్తారు? ఏమైనా క్లారిటీ ఇస్తారా? పార్టీ ఆవిర్భావ సభలో ఎలాంటి ప్రకటన చేస్తారు అన్నది ఉత్కంఠ పెంచుతోంది.

ఇదీ చదవండి : టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించిన చాంగంటి.. కారణం ఇదే..

మచిలీపట్నంలోనే ఎందుకు ఆవిర్భావ సభ?

ఎన్నికలకు సమయం దగ్గర పడడంలో ఈ సారి పార్టీ ఆవిర్భావ సభను ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారని అంతా భావించారు. భారీ స్థాయిలో సభకు ప్లాన్‌ చేసుకోవాలన్నా.. అదే స్థాయిలో పార్టీకి ఊపు తేవాలన్నా గోదావరి జిల్లాలైతే బాగుంటుందనేది జనసైనికుల అభిప్రాయం. కానీ ఎవరూ ఊహించని విధంగా మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ సభ జరపాలని పవన్ డిసైడ్ చేశారు. అయితే బందర్‌లో పార్టీ సభ పెట్టడానికి ప్రత్యేక కార్యణాలే ఉన్నాయట. జనసేన ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన బహిరంగ సభ నిర్వహించింది లేదు. పైగా గోదావరి జిల్లాల్లోనే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోనూ జనసేనకు పట్టుందని నిరూపించుకోవాలంటే మచిలీపట్నం అయితే బెటర్‌ అనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: భార్యతో ఎఫైర్.. భర్త ఫేస్ బుక్ లో ఆ కామెంట్ చేశాడని.. ఎంత పనిచేశాడంటే..?

మాజీ మంత్రి పేర్ని నానిపై గురిపెట్టారా?

కృష్ణా జిల్లాలో కాపు సామాజికవర్గం ఎక్కువుగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. మచిలీపట్నం, పెడన, గుడివాడ, అవనిగడ్డ, గన్నవరం తదితర నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గమే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. దీనికితోడు పవన్‌ కల్యాణ్‌ను ఎక్కువగా టార్గెట్‌ చేసుకుంటున్న వైసీపీ నేతల్లో మచిలీపట్నం MLA పేర్ని నాని ముందు ఉంటున్నారు. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్‌ ఇవ్వాలంటే చాలు పేర్ని నాని తెరమీదకు వస్తారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు.. కేబినెట్‌లో చోటు కోల్పోయినా.. ఆయన పవన్ ను వదలడం లేదు.. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పేర్ని నానిపై ప్రత్యేక ఫోకస్ చేసినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ఏపీలో రోడ్డుపై రూ. 500 నోట్ల వర్షం.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత.. ఎవరిదంటే?

వారాహిపైనే బందర్‌ వరకు పవన్‌ కల్యాణ్‌ రోడ్‌ షో..!

ఒక్క పేర్ని నానికే కాకుండా పవన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వైసీపీ కాపు సామాజికవర్గం నేతలకు గట్టిగా కౌంటర్‌ ఇవ్వాలంటే మచిలీపట్నమే బెటర్‌ అని జనసేన భావించినట్టు సమాచారం. ఇంకోవైపు ప్రచార రథం వారాహిని తొలిసారి జనం మధ్యలోకి తెస్తున్నారు. పార్టీ సభకు వారాహి వాహనంపైనే పవన్‌ కల్యాణ్‌ బందర్‌ వెళ్లబోతున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మచిలీపట్నం వరకు వారాహిపై రోడ్‌ షో నిర్వహిస్తారని.. మధ్య మధ్యలో ఆగుతూ.. జనం సమస్యలు తెలుసుకుని వెళ్లేలా రూట్‌ మ్యాప్‌ ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు