పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణకు భారీ విరాళం..

ప్రముఖ సినీ నటుడు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కరోనా కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు తన వంతు  సాయంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెరో..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 26, 2020, 9:30 AM IST
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణకు భారీ విరాళం..
పవన్ కల్యాణ్
  • Share this:
ప్రముఖ సినీ నటుడు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కరోనా కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు తన వంతు  సాయంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెరో రూ.50 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు స్థంభించిపోయాయి. రెక్కాడితే కానీ డొక్క ఆడని చాలా మంది నిరుపేదలు లాక్‌డౌన్ సందర్భంగా పనిలేకుండా పోయింది. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సినీ నటులు తమ వంతు సామాజిక బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు. మరికొందరు స్వయంగా రంగంలోకి దిగి తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయంగా చెరో రూ.50 లక్షలు మొత్తంగా కోటి రూపాయలను విరాళంగా అందజేయడం గమనార్హం. ఇప్పటికే హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు దక్షిణ భారత చలన చిత్ర కార్మికుల సంక్షేమం కోసం రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య తమ వంతుగా ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు