• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • JANASENA CHIEF PAWAN KALYAN AGAIN TARGET ANDHRA PRADESH YCP GOVERNEMENT OVER CAPITAL AMARAVATI ISSUE NK

Amaravati: ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకోవాలా... ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్

ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకోవాలా... ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్ (credit - twitter)

Amaravati: దుబ్బాకలో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో... ఏపీలో మిత్రపక్షమైన జనసేన స్పీడ్ పెంచింది. ప్రభుత్వంపై డైలాగ్ వార్ మొదలుపెట్టారు అధినేత పవన్ కళ్యాణ్.

  • Share this:
    Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలం సైలెంట్‌గా ఉన్న జనసేన (Janasena)... మళ్లీ జోరు పెంచింది. రాజధాని అమరావతి అంశంలో ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు ఆ పార్టీ అధినత పవన్ కళ్యాణ్. అమరావతిని రాజధానిగా ఉంచాలని ఉద్యమం చేస్తున్నవారిపై అధికార పార్టీ (YCP) నేతలు చేస్తున్న కామెంట్స్ సరికాదన్నారు ఆయన. మంచి బట్టలు కట్టుకొని, బంగారం పెట్టుకుని ఉద్యమం చెయ్యకూడదా? అని ప్రశ్నించిన ఆయన... ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకుని ఉండాలా అని నిలదీశారు. ఉద్యమానికీ... ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం మంచిది కాదన్న పవన్ కళ్యాణ్... అమరావతి అంశాన్ని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని మండిపడ్డారు.


    రైతులకు మద్దతు:
    అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. రైతులకు న్యాయం చేసే విషయంలో జనసేన వెనకడుగు వెయ్యదన్న ఆయన... బీజేపీ కూడా అమరావతినే రాజధానిగా చూస్తోందన్నారు. దీనిపై తనకు డిక్లరేషన్ కూడా ఇచ్చారన్న జనసేనాధినేత... 365 రోజుల్లో అనుకున్నది అయిపోవాలి అనేది కష్టమైన అంశం అన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నామని అధికారికంగా ప్రభుత్వం చెప్పలేదన్న పవన్... ప్రభుత్వం అధికారికంగా చెప్పిన తరువాత జనసేన ఏమి చేస్తుందో చెప్తా అన్నారు.



    ఇది కూడా చదవండి: అంబులెన్స్‌లో కరోనా రోగులు. రోడ్డుపై 45 సెం.మీ. మంచు. వైద్య సిబ్బంది సాహసం. ప్రశంసల జల్లు

    దుబ్బాక తర్వాత స్పీడ్:
    తెలంగాణలో దుబ్బాక స్థానంలో విజయం బీజేపీ నేతల్లో జోష్ నింపడం సహజం. కానీ... చిత్రంగా జనసేనలో అది ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానమే దక్కించుకున్న జనసేనలో... ఒక్క అడుగుతోనే తామేంటో నిరూపించాలనుకున్నారు. ఐతే... కరోనా వచ్చాక... పార్టీ తన డిమాండ్లన్నీ సోషల్ మీడియా ద్వారానే వినిపించింది. ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ గెలవడంతో... తాము కూడా అలాంటి పోటీ తత్వంతో అడుగులు వెయ్యాలని జనసేన శ్రేణులు డిసైడైనట్లు తెలుస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే... అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు జనసేనలో కనిపిస్తోంది. ఈ ఉత్సాహం వల్లే... హైదరాబాద్... GHMC ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తద్వారా... మళ్లీ తమ పార్టీ ఫుల్ యాక్టివ్ అయ్యిందనే సంకేతాలిచ్చారు. మరి ప్రజలు ఈ మార్పును ఎలా చూస్తున్నారన్నది త్వరలో తెలుస్తుంది.
    Published by:Krishna Kumar N
    First published: