Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    పవన్‌తో భేటీకి ముందు ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు...అమరావతి రాజధాని మా ఎజెండా కాదు

    రాష్ట్రంలో అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు జీవీఎల్ తెలిపారు. అంతేకాదు 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి వెళ్లడంపై చర్చిస్తామని ఈ సందర్భంగా జీవీఎల్ తెలిపారు.

    news18-telugu
    Updated: January 16, 2020, 11:22 AM IST
    పవన్‌తో భేటీకి ముందు ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు...అమరావతి రాజధాని మా ఎజెండా కాదు
    జీవీఎల్ నరసింహారావు(ఫైల్ ఫోటో)
    • Share this:
    బీజేపీ, జనసేన పార్టీల సమావేశం ఉదయం 11 గంటలకు విజయవాడలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు పలు విషయాలపై చర్చించనున్నారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ రానున్న నాలుగేళ్లలో ఏపీలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. అంతేకాదు అమరావతి రాజధాని అంశంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలు తమ అజెండా కాదన్నారు. రాష్ట్రంలో అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు జీవీఎల్ తెలిపారు. అంతేకాదు 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి వెళ్లడంపై చర్చిస్తామని ఈ సందర్భంగా జీవీఎల్ తెలిపారు. ఇదిలా ఉంటే గురువారం విజయవాడలో జనసేన, బీజేపీ నేతలు సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి స్నేహహస్తం చాపిన నేపథ్యంలో బీజేపీ ఏపీ నేతలు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    మరోవైపు ఏపీలో మూడు రాజధానులపై స్పందించిన బీజేపీ.. ఒకే చోట రాజధాని ఉండాలని అంటోంది. అటు జనసేన కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తోంది. ఇక 2014లోనూ బీజేపీ, టీడీపీలతో కలిసి పని చేసిన జనసేన, ప్రస్తుతం మరోసారి బీజేపీతో చేతులు కలపనుంది.
    Published by: Krishna Adithya
    First published: January 16, 2020, 11:22 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading