హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan kalyan in Nalgonda: తెలంగాణలో జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి పెడతా.. పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

Pawan kalyan in Nalgonda: తెలంగాణలో జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి పెడతా.. పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సైతం పవన్​కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఆయన రాక కోసం (Pawan kalyan Telangana tour) ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా పవన్​ నల్గొండ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో సైతం పవన్​కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఆయన రాక కోసం (Pawan kalyan Telangana tour) ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా పవన్​ నల్గొండ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో (Telangana ) జనసేన పార్టీ (Jana sena Party) పటిష్టతపై దృష్టి సారించనున్నట్లు ఆ పార్టీ చీఫ్​ పవన్​ కల్యాణ్ (Pawan Kalyan)​ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జనసేన చీఫ్ పవన్​ కల్యాణ్​ పర్యటించారు.

జనసేన అధినేత పవన్​ కల్యాణ్ (Jana sena President Pawan kalyan) పార్టీ పెట్టినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేస్తారని అనుకున్నారు రాజకీయ నాయకులు. పవన్​ అభిమానులు సైతం ఇదే అనుకున్నారు. కానీ అనూహ్యంగా పవన్​ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారనుకున్నా చివరి నిమిషంలో వెనుదిరిగారు. ఇక తెలంగానలో కష్టమే అని అనుకుంటున్న తరుణంలో సరైన సమయంలో తెలంగాణలో అడుగుపెడుతాననే ఇటీవలె సూచన ప్రాయంగా జనసేనాని ప్రకటించినట్లు తెలిసింది. కాగా, తెలంగాణలో సైతం పవన్​కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఆయన రాక కోసం (Pawan kalyan Telangana tour) ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా పవన్​ నల్గొండ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో (Telangana ) జనసేన పార్టీ (Jana sena Party) పటిష్టతపై దృష్టి సారించనున్నట్లు ఆ పార్టీ చీఫ్​ పవన్​ కల్యాణ్ (Pawan Kalyan)​ వ్యాఖ్యానించారు.

శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జనసేన చీఫ్ పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan) పర్యటించారు. నల్లగొండకు బయలుదేరిన పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్దనున్న అక్కపురి చౌరస్తా వద్ద జనసైనికులు, పవన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్​ మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana ) రాజకీయాల్లో కూడా విద్యార్ధులు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.  ఇటీవల నల్గొండ (Nalgonda) జిల్లా చౌటుప్పల్​ (Choutuppal) మండలం లక్కారానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో సైదులు కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కల్యాణ్.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులదే కీలక పాత్ర..

జనసేన పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల సాయానికి సంబంధించిన చెక్ అందించారు పవన్ కల్యాణ్.  తెలంగాణలో పార్టీ పటిష్టతపై కంద్రీకరించనున్నట్టుగా పవన్ కల్యాణ్ చెప్పారు.  తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులే కీలక పాత్ర పోషించారని జనసేన అధినేత అన్నారు.   చౌటుప్పల్ నుంచి కోదాడకు పవన్ కల్యాణ్ బయలు దేరారు. కోదాడలో ఇటీవల చనిపోయిన జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస రావు కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల చెక్ అందిస్తారు.


పోటీ చేయాలనే..

ఇటీవల ఏపీలో విస్తృతంగా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్. చనిపోయిన జన సైనికుల కుటుంబాలను పరామర్శిస్తూ వాళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రౌతుల కుటుంబాలకు సాయం చేస్తున్నారు. ఈ సందర్బంగా రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన చీఫ్. పొత్తులపైనా మాట్లాడుతున్నారు. టీడీపీ పొత్తు దిశగా సంకేతం ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపీలో పవన్ కామెంట్లు కాక రేపుతున్నాయి. ఇప్పుడు పవన్ తెలంగాణలో పర్యటిస్తుండటంతో.. ఇక్కడ కూడా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణలోనూ జనసేనకు కార్యకర్తలు ఉన్నారు. బీజేపీలో పొత్తు ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కొన్ని సీట్లకు పోటీ చేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

First published:

Tags: Janasena, Nalgonda, Pawan kalyan

ఉత్తమ కథలు