Pawan Kalyan on Corona: ఆంధప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్లీ కఠిన నిబంధనలు తప్పడం లేదు.. ఎందుకంటే రోజు వారీ కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇప్పటికే పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ వైపు వైద్య పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) 144 ఆక్సిజన్ ప్లాంట్ లను ప్రారంభించారు. మరోవైపు కరోనా వైరల్ (Corona Virus) వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నైట్ కర్ఫ్యూ (Night Curfew) అమలు చేస్తున్నారు.. మరోవైపు రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyana) ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో మందులు, ఆక్సిజన్ దొరకక ఎంతో మంది ప్రజలు అల్లాడిపోయారన్నారు. ఎందరినో ఆ సమయంలో చాలా మందిని కోల్పోయామని, ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. తక్షణమే అప్రమత్తం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచనలు చేశారు. అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించాలని కోరారు..
అత్యవసరం అయితే తప్ప విందులు, సమావేశాలు లాంటి వాటికి కొన్ని నెలల పాటు దూరంగా ఉండడమే మంచిందని సలహా ఇచ్చారు.
ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలని కోరారు. ఎక్కువమంది గుమి గూడితే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇక ఇప్పటి వరకు టీకా తీసుకొనేవారు తప్పనిసరిగా వెంటనే టీకా వేయించుకొనే ప్రయత్నం చేయాలి అన్నారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. ప్రతి మనిషి చిన్నచిన్న జాగ్రత్తలు పాఠిస్తే కరోనా ఉధృతిని కొంత వరకు తగ్గించ వచ్చన్నారు.
కరోనా తీవ్రతరమవుతోంది... అప్రమత్తత అవశ్యం - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/IZ4sX0jTEO
— JanaSena Party (@JanaSenaParty) January 10, 2022
భారత దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం చాలా ఉంది అన్నారు. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఒక్క రోజే లక్ష 80 వేల మందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయని.. అంతకు ముందు రోజు ఆ సంఖ్య లక్ష 59 వేలుగా ఉందంటే మహమ్మారి ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి : ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి.. టీడీపీ కొత్త నినాదాం ఇదే..
ఇక ఆంధ్రప్రదేశ్ లో వేయికి అటు ఇటుగా.. తెలంగాణలో 15 వందలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ పెరుగుతున్నారని…దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టీవ్ కేసులు 7.23 లక్షలు ఉన్నాయని వెల్లడించారు. ఈక్రమంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పినట్లు అందరూ అప్రమత్తంగా ఉండి ఈ మహమ్మారిని పారద్రోలుదామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.