హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: జనసేనాని పోటీ చేసే ప్లేస్ ఫిక్స్ ..? మరి పవన్ చరిత్రను తిరగరాస్తారా..? చతికిలపడతారా?

Pawan Kalyan: జనసేనాని పోటీ చేసే ప్లేస్ ఫిక్స్ ..? మరి పవన్ చరిత్రను తిరగరాస్తారా..? చతికిలపడతారా?

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఫిక్స్ అయ్యారా.. ఆ సామాజిక వర్గం బలంగా లేని చోటే పోటీ చేయాలని నిశ్చయించారా..? ఆ నియోజక వర్గం నుంచే పోటీ చేయాలని పవన్ ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారా..? అక్కడ పోటీ చేస్తే చరిత్ర తిరగరాయం సాధ్యం అవుతుందా..? ఇంతకీ ఏంటి ఆ నియోజకర్గం ఏంటి?

ఇంకా చదవండి ...

Pawan Kalyan: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కానీ.. పోటీ చేసిన రెండు చోట్ల ఆయన ఓడిపోయారు. ఆ రెండు ఓటములు.. పవన్ తో పాటు.. ఆయన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాయి. ఆ ఓటమి నుంచి బయట పడాలి అంటే.. 2024 ఎన్నికల్లో పవన్ కు పార్టీ గెలుపుతో పాటు.. వ్యక్తిగత విజయం కూడా చాలా అవసరం. అలాంటప్పుడు నియోజకవర్గం ఎంపిక చాలా ముఖ్యం. అందుకే పవన్ ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం లేదా.. యూత్ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట నుంచి పోటీ చేయాలి.. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే.. పవన్ అతి పెద్ద ఛాలెంజ్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ (ycp) కి చెందిన ఆ ఎమ్మెల్యేపై పోటీ చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అవకాశం దొరికితే చాలు.. ఆ ఎమ్మెల్యేని ఉతికి ఆరేస్తుంటారు. ఆ ఎమ్మెల్యేని ఓడించడానికి.. ఆ పార్టీ అగ్రనేత బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నియోజకవర్గ చరిత్ర చూస్తే ఆ సామాజికవర్గానికి అక్కడ ఓటమే తప్ప గెలుపు లేదు. అలాంటి సెంటిమెంట్‌ ఉన్న ఆ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తారా? చరిత్రను తిరగరాస్తారా? లేక సాంప్రదాయానికి బలవుతారా? అన్నది చూడాలి..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ (Kakinada City) నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది అంటున్నారు జన సైనికులు.. పవన్‌ కళ్యాణ్‌ ప్రతి మీటింగ్‌లోనూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (Dwarampudi Chandra Sekhar Reddy)పై మండిపడుతూ ఉంటారు. తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఆ మధ్య జనసేన (Janasena) ఆవిర్భావ సభలో కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి తీరు మారకపోతే భీమ్లానాయక్‌ (Bheemla Nayak) ట్రీట్మెంట్‌ ఇస్తానని హెచ్చరించారు. ఆ ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జనసేనసభలో పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ లేదా ఇంకెక్కడి నుంచి పోటీ చేసిన జనసేనానిని ఓడిస్తానని శపథం చేశారు.

ఇదీ చదవండి : ఏప్రిల్‌ 7న కేబినెట్ భేటీ.. ఆ మంత్రులకు అదే లాస్ట్.. కొనసాగేది ఆ ఇద్దరే.. కొత్త స్పీకర్ ఎవరంటే?

కాకినాడ చరిత్ర చూస్తే ఇక్కడ కాపు సమాజికి వర్గానికి ఎప్పుడు కలిసి రాలేదు. నియోజకవర్గంలో ఉన్న సామాజికవర్గాలు.. ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థుల గురించి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఆ లెక్కన చూస్తే పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో పోటీ చేయకపోవచ్చన్నది కొందరి వాదన. 70 ఏళ్లలో కాకినాడ నుంచి కాపు సామాజికవర్గం ఒక్కసారే గెలిచిందని చెబుతున్నారు. ప్రధాన పార్టీలు కూడా కాకినాడ అసెంబ్లీ సీటును కాపులకు ఇవ్వలేదు. అందుకు కారణం అక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలే. కాకినాడలో కాపులు గెలవడం అంత ఈజీ కాదు.

ఇదీ చదవండి : : 40వ ఆవిర్భావ దినోత్సవం రోజు కీలక నిర్ణయం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి 40 శాతం సీట్లు.. లోకేష్, చంద్రబాబు (ఫైల్)

తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కాపు సామాజికవర్గానికి పెట్టని కోట అయినప్పటికీ కాకినాడ సిటీ అసెంబ్లీకి వచ్చే సరికి లెక్కలు సరిపోవడం లేదు. కాకినాడ లోక్‌సభకు మాత్రం పార్టీలు ఏవైనా కాపు అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు  (Pallam raju) తాత మల్లిపూడి పళ్లంరాజు మాత్రమే 1955లో కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దానికి ముందుకానీ.. తర్వాతగానీ ఆ సామాజికవర్గం నుంచి ఒక్కరూ గెలవలేదు.

ఇదీ చదవండి : సామాన్యులకు ఏపీ సర్కార్ కరెంట్ షాక్.. పెరిగిన కొత్త ఛార్జీలు ఇవే.. ప్రతీకాత్మక చిత్రం

కాకినాడ సిటీ నియోజకవర్గంలో 2 లక్షల 55 వేల 716 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు సామజికవర్గం ఓటర్లు 28.6 శాతం. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కూడా కాపు సామాజికవర్గమే. కానీ.. కాపు అభ్యర్థి నిలుచుంటే గెలవడం లేదన్నది చరిత్ర చెబుతున్న మాట. కాకినాడ పార్లమెంట్‌ పరిధిలోని మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడతారు కానీ.. కాకినాడ సిటీలో సీన్‌ రివర్స్‌. కాకినాడ రూరల్‌లో మంత్రి కురసాల కన్నబాబు, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, తునిలో దాడిశెట్టి రాజా, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, పిఠాపురంలో పెండెం దొరబాబు, ప్రత్తిపాడులో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత కూడా కాపు సామాజికవర్గమే. ఈ లెక్కలు చూశాకే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? టీడీపీకి పూర్వ వైభవం వచ్చేనా..? ఆవిర్భావ దినోత్సం వేదికగా వ్యూహాలు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్‌ కల్యాణ్‌. ఈసారి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. కాకినాడ మినహాయించి మూడు సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు టాక్‌. వాటిల్లో పిఠాపురం, కాకినాడ రూరల్‌, రాజమండ్రి రూరల్‌ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం ఎక్కువ. ఈ మూడింటిలో ఎక్కడ నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసినా వార్‌ వన్‌సైడ్‌గా ఉంటుందనేది జనసేన నేతల అంచనా. మరి.. జనసేనాని ఏం చేస్తారో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Pawan kalyan

ఉత్తమ కథలు