Polavaram Project: ఆ వ్యయాన్ని మాత్రమే కేంద్రం భరిస్తుంది.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం రిప్లై

పోలవరం ప్రాజెక్ట్(ఫైల్ ఫొటో)

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి అన్నారు. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

  • Share this:
    డిజైన్లు మార్చినప్పటికీ.. 2014 ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డిజైన్ల మార్పుల వల్ల హెడ్‌ వర్క్స్‌ వ్యయం 5,535 కోట్ల రూపాయల నుంచి 7,192 కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపినట్టుగా కేంద్ర మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి అన్నారు. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

    గోదావరి ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలన్నారు. వాటిని సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ప్రాజెక్ట్‌లోని కొన్ని అంశాలకు సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని మంత్రి చెప్పారు.

    మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్‌ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్‌ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్‌ నిర్మాణం, గేట్‌ గ్రూవ్స్‌లో చిప్పింగ్‌ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్‌ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని మంత్రి తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: