M BalaKrishna, Hyderabad, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి రాజధానిగా అమరావతి (Capital Amaravathi) ప్రాంతాన్ని అప్పటి తెలుగుదేశం (Telugu Desham Party) ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని పూర్తయ్యేలోపు టీడీపీ ఓడిపోవడం, వైసీపీ (YSRCP) అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయింది. ఐతే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసి ఏపీ సీఆర్డీఏను ఏర్పాటు చేశారు. ఐతే ఆ సీఆర్డీఏను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ప్రభుత్వం మళ్లీ దానిని తీసుకొచ్చింది. అప్పట్లో సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ ఆథారిటీ అని విమర్శలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఇదే సీఆర్డీఏ ఆద్వర్యంలో ప్రభుత్వం వెంచర్లు వేసి ప్లాంట్స్ అమ్మలని నిర్ణయించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అప్పట్లో సీఆర్డీఏ రాజధాని ప్రాంతం అబివృద్దికి ఏర్పాటు చేస్తేనే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించిన జగన్ అండ్ కో ఇప్పుడు అదే సీఆర్డీఏ ప్రాంతంలోనే కాకుండా 175 నియోజకవర్గాల్లో వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడంపై ఇప్పుడు సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
ఇదే అంశంపై ప్రజల్లో ఇటు మీడియా ముందు ఎలా డిఫెన్స్ చేసుకోవాలో తెలియక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 175 నియోకవర్గాల్లో వెంచర్ల వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా... అమరావతి ప్రాంతంలో వేసిన జగనన్న టౌన్ షిప్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది.
ఒక వైపు ఏపీ రాజధాని అమరావతి కాదని చెబుతూనే ఇక్కడ వేసిన వెంచర్ కు సంబంధించి బ్రోచర్ లో ఏపీ సచివాలయం 10 కిలో మీటర్లు, హై కోర్టు 15 కిలోమీటర్లు అని దూరంలో ఉన్నాయని ఈ బ్రోచర్ లో ప్రభుత్వం ముద్రించడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఆర్డీఏ అనేది రాజధాని ప్రాంత అభివృద్ది కోసం ఏర్పాటు చేశామని ప్రకటిస్తే.. రియల్ ఎస్టేల్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించిన జగన్ అండ్ కో ఇప్పుడేం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఓ వైపు వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తూనే.., అమరావతిలో వేసిన వెంచర్ కు సచివాలయం, హైకోర్టును ల్యాండ్ మార్క్స్ గా చూపిస్తూ బ్రోచర్లు వేయడంపై మండిపడుతున్నారు.
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ పథకం ద్వారా వైసీపీ ప్రభుత్వం పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసిందని, ఇసుక, మధ్యం, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న భూములు ఏ ఒక్కటి వదలకుండా జగన్ దోచుకుంటున్నారని అన్నారు టీడీపీ నేత పట్టాబి. ప్రభుత్వం సచివాలయాన్ని విశాఖపట్నం కు, హైకోర్టు కర్నూలుకు తరలించాలని నిర్ణయించి ఇప్పుడు రియల్ వ్యాపారం చేస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఆర్ డీఏ ఎంఐజీ జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టులో వీటిని చూపించి మార్కెట్ చేయటం ఎంటనేది టీడీపీ నేతల వాధన. అయితే ఇదే అంశంలో అధికాపార్టీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకి ఎవరు ఇలాంటి ఐడియాలు ఇస్తున్నారో తెలియటం లేదని కనీసం లాజిక్ లేకుండా నిర్ణయాలు ఉంటున్నాయని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.