హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagananna Smart township: జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 40శాతం డిస్కౌంట్..!

Jagananna Smart township: జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 40శాతం డిస్కౌంట్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh: జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ప్లాట్‌ మొత్తం విస్తీర్ణాన్ని రెండుగా విభజించనున్నారు. ఇందులో 60% ప్రాంతాన్ని అమ్మకపు ధరగా చూపిస్తారు. మిగతా 40% ప్రాంతాన్ని అభివృద్ధి ధరగా పేర్కొంటారు. ఆ 60% అమ్మకపు ధరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాలి

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  పట్టణ ప్రజలకు తక్కువ ధరకే ప్లాట్‌లు అందించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ (Jagananna Smart township) పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటికి భారీగా డిమాండ్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఊహించింది. కానీ అలాంటి పరిస్థితులు లేవు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు స్పందన కొరవడటంతో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌లో 60% భూమి విలువపైనే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించేలా నిర్ణయించింది. అంటే రిజిస్ట్రేషన్ చార్జీల్లో 40శాతం డిస్కౌంట్ ప్రకటించినట్లు భావించాలి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)కు సంబంధించిన కొన్ని లేఅవుట్లలో కూడా స్థలాల కొనుగోలుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వారే ఆకర్షించడానికి తీసుకున్న తాజా నిర్ణయాన్ని.. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు కూడా వర్తింపజేసింది.

  ఇకపై జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ప్లాట్‌ మొత్తం విస్తీర్ణాన్ని రెండుగా విభజించనున్నారు. ఇందులో 60% ప్రాంతాన్ని అమ్మకపు ధరగా చూపిస్తారు. మిగతా 40% ప్రాంతాన్ని అభివృద్ధి ధరగా పేర్కొంటారు. ఆ 60% అమ్మకపు ధరకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాలి. 40% అభివృద్ధి ధరపై ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఉండవు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ఎంఐజీ ప్లాట్ల ధరను ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించినందున, వాటి విస్తీర్ణాన్ని రెండుగా విభజించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని పట్టణాభివృద్ధి సంస్థలను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశించింది.

  మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే భూములు ఇవ్వాలన్న సంకల్పంతో ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకంలో మూడు కేటగిరీల్లో 150 గజాలు, 200 గజాలు, 240 గజాలల్లో ప్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. https://migapdtcp.ap.gov.inలో అప్లై చేసుకోవచ్చు. రూ.18లక్షల వార్షికాదయం లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో ఏడాదిలోగా చెల్లించే అవకాశం ఉంటుంది. తొలి వాయిదాలో 10శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, ఆరు నెలల్లోపు మరో 30శాతం , రిజిస్ట్రేషన్ చేసుకునేనాటికి అంటే ఏడాది లోపు మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకేసారి పూర్తి మొత్తం చెల్లిసే 5శాతం రాయితీ ఇస్తారు.

  ఇళ్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్లో 10శాతం ప్లాట్లను 20శాతం రిబేట్‌తో కేటాయిస్తారు. ఈ లేవుట్లలో పార్కులు, రోడ్లు, ఫుట్ పాత్ లు, మంచినీటి సరఫరా, డ్రెయినేజీ వ్యవస్థ, వరదనీటి డ్రెయినేజ్ వ్యవస్థను కూడా నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. విద్యుత్, వీధి దీపాల వంటి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయని పేర్కొంది. ఐనప్పటికీ ప్రజల నుంచి మాత్రం స్పందన కరువయింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ys jagan

  ఉత్తమ కథలు