Jagananna Chedodu : జగనన్న చేదోడు పథకం(Jagananna Chedodu Scheme )కింద లబ్దిదారులకు మూడవ విడత సాయం రూ.330.15 కోట్లు ఇవాళ(జనవరి 30,2023)మంజూరు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్.. జగనన్న చేదోడు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 అర్హుల అకౌంట్లలోకి బటన్ నొక్కి నగదును జమ చేశారు. గతేడాది జగనన్న చేదోడు పథకం రెండో విడత ద్వారా 2.99 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.299.23 కోట్లు జమ చేయగా నేడు మూడో విడత కింద 3.31 లక్షల మంది ఖాతాల్లో రూ.330.15 కోట్లు జమ చేశారు సీఎం వైయస్ జగన్. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులతో సీఎం జగన్ మాట్లాడారు.
జగనన్న చేదోడు పథకంలో భాగంగా చేతి వృత్తిదారులు అంటే దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మ ణుల బ్యాంకు అకౌంట్లలో రూ.10 వేల చొప్పున ప్రభుత్వం జమ చేసింది. జగనన్న చేదోడు పథకం కింద దుకాణాలు ఉన్న 1,67,951 మంది టైలర్లకు ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున రూ.167.95 కోట్లు, దుకాణాలు ఉన్న 1,14,661 మంది రజకులకు ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున రూ.114.67 కోట్లు, దుకాణాలు ఉన్న 47,533 మంది నాయీబ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున రూ47.53 కోట్లు అందజేశారు.
Tirumala: ఏపీలో ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు.. !
జగనన్న చేదోడు పథకం కింద ఇప్పటివరకు, రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో 2,98,122 మందికి ప్రయోజనం చేకూర్చేందుకు రూ. 298.12 కోట్లు,2021-22లో 2,99,116 మందికి రూ.299.12 కోట్లు, 2022-23లో 3,30,145 మందికి రూ. 330.15 కోట్లు అందించింది, ఈ విధంగా పంపిణీ చేయబడిన మొత్తం నేడు అందిచిన మొత్తంతో కూడా కలిపి రూ.927.39 కోట్లకు చేరుకుంది.
జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల్లో ఇదివరకే రుణాలు ఉంటే చేదోడు కింద విడుదలయ్యే నగదును రుణం కింద జమచేసుకోకుండా బ్యాంకులతో మాట్లాడి, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారికి ధన్యవాదాలు చెబుతూ ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ట్వీట్టర్ లో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Cm jagan, Money