రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

రాష్ట్రంలో 13 అగ్రి ల్యాబ్‌లు జిల్లా స్థాయిలో, 147 నియోజకవర్గ స్థాయి, మరో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి.

news18-telugu
Updated: July 25, 2020, 6:18 AM IST
రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం..
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఏటా నకిలీ విత్తనాలు, నాసిరకమైన ఎరువులు, పురుగుమందులతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. నకిలీలను నివారించేందుకు అధికారులు ఎంత నిఘా పెట్టిన అక్రమార్కులు వాటిని కొత్త దారుల్లో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని అంటగడుతూనే వస్తోంది. ఫలితంగా రైతులు పంట దిగుబడినే కోల్పోవడమే కాకుండా ఆర్థికంగానూ చితికిపోతున్నారు. దీన్ని గమనించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు చేకూర్చనుంది. రాష్ట్రంలో 13 అగ్రి ల్యాబ్‌లు జిల్లా స్థాయిలో, 147 నియోజకవర్గ స్థాయి, మరో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

ఈ ల్యాబ్స్ వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలించనున్నారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించి రూ.197 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టును సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాబార్డుకు అందజేసింది. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కిందరూ.150 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. ఏదీఏమైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అగ్రి ల్యాబ్స్ రైతులకు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయనడంలో సందేహం లేదు.
Published by: Narsimha Badhini
First published: July 25, 2020, 6:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading