జగన్ అక్రమాస్తుల కేసు... సీబీఐ కోర్టు ఏమందంటే...

సీఎం జగన్

Andhra Pradesh : వైసీపీ అధినేత జగన్‌కి సంబంధించి అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

 • Share this:
  Andhra Pradesh : వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మొత్తం 11 చార్జిషీట్‌లకు సంబంధించి కోర్టు విచారణ జరిపింది. నెక్స్ట్ విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేసింది. ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. వారే కాదు... ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. కేవలం ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ మాత్రమే హాజరయ్యారు. ఈ కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచీ మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా... 15 రోజుల కిందట ఇదే కోర్టు వ్యక్తిగత హాజరు నుంచీ మినహాయింపు ఇవ్వడం సాధ్యంకాదని, కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని చెప్పింది. ఐతే జగన్ అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నందున ఆయన కోర్టుకు హాజరు కాలేకపోయారని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణను డిసెంబర్ 6కి (శుక్రవారం) వాయిదా వేసింది.

   

  Pics : మేఘా ఆకాశ్ క్యూట్ ఫొటోస్
  ఇవి కూడా చదవండి :

  షాకైన చంద్రబాబు... వాటినీ వదలరా అంటూ వైసీపీపై ఫైర్...

  అన్నీ పింక్ కలరే... అంతా పింక్ బాల్ సందడి...

  Health : గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు

  Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు


  Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?
  First published: