నేను, వంశీ ఫోన్లు చేస్తే ఉమ ఎత్తట్లేదు -చాలా మంది టీడీపీ వాళ్లకు ఈ విషయం తెలీదు : kodali nani

నాని, వంశీ ఫైల్ ఫొటో

వేదిక ఏదైనా టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడటం వైసీపీ మంత్రి కొడాలి నానికి అలవాటు. వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత సంబురాల్లోనూ ఆయన అదే పని చేశారు. చంద్రబాబును పిట్టలదొరంటూ మాజీ మంత్రి దేవినేని ఉమవి సొల్లు కబుర్లని తిట్టిపోశారు. ఈక్రమంలో తనకు, దేవినేనికి, ఫిరాయింపు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలను నాని వెల్లడించారు..

  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒక్కటే బలమైన రాజకీయ పార్టీ అని, మాస్ ఇమేజీ ఉన్న ఏకైక నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కడేనని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా ఎగిరేది వైసీపీ జెండానే అని, ప్రజల్ని నిలువునా మోసం చేసిన టీడీపీకి రాజకీయ భవిష్యత్తు శూన్యమని జోస్యం చెప్పారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఆదివారం జరిగిన వైఎస్సార్ ఆసరా పథకం (YSR Asara Scheme) రెండో విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాని మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సినియర్ నేత దేవినేని ఉమపై విమర్శలు గుప్పించారు.

లేనిదానిని ఉన్నట్లు నమ్మించే వ్యక్తి చంద్రబాబు అని, పగటి వేషగాడు, పిట్టలదొరకు ఏమాత్రం తక్కువకాని చంద్రబాబు.. డ్వాక్రా సంఘాలను తానే ప్రవేశపెట్టానని గొప్పలు చెబుతారని మంత్రి కొడాలి మండిపడ్డారు. నిజానికి దేశంలో డ్వాక్రా సంఘాలను ప్రారంభించిన ఘనత పీవీ నర్సింహారావుదని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్న చంద్రబాబు.. మహిళల పాలిట గజమోసగాడని, దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను ముంచినవాడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుందని నాని ఫైరయ్యారు.

Pawan Kalyan: ఎవరూ చేయలేని పనిని తలకెత్తుకున్న JanaSena -మాజీ సీఎం కోసం కోటి రూపాయలతో నిధి


జగన్ సర్కారుపై వరుస విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న టీడీపీ నేత దేవినేని ఉమపైనా మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలుపెట్టారు. దేవినేని ఉమ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. అసలు విషయమేంటో అడుగుదామని నేను, వల్లభనేని వంశీ ఫోన్లు చేసినా ఉమ ఫోన్ ఎత్తడు. మా నంబర్లను బ్లాక్‌లో పెట్టేశాడు. దేవినేని ఉమ ఓ చవటదద్దమ్మ..’అని నాని వ్యాఖ్యానించారు.

చెరుకు రసం ఆశ చూపి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. యువకుడిపై అత్యాచారం -మగాణ్ని మగాడే: వారంలో రెండో ఘటన


దేవినేని ఉమ పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దన్న కొడాలి.. ఒకవేళ ఇబ్బందికి గురిచేసినవాళ్లపై నిర్మొహమాటంగా కేసులు పెట్టాలని, అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘చాలా మంది టీడీపీ సన్నాసులకు ఓ విషయం తెలియదు. వైసీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. పేరులో కాంగ్రెస్ ఉందికదాని అలా అనుకోకండి. ఏపీలో బలమైన మాస్ ఇమేజ్ ఉన్న శక్తిమంతమైన పార్టీ వైసీపీ’అని గుర్తుచేశారు.
Published by:Madhu Kota
First published: