Home /News /andhra-pradesh /

JAGAN AP CABINET RESHUFFLE LIKELY ON UGADI DAY ALL MINISTERS TO RESIGN ON MARCH 27 MKS GNT

Cabinet Reshuffle: 27న మంత్రుల రాజీనామా.. ఉగాదిన కొత్త కేబినెట్.. CM Jagan మళ్లీ పాత ఫార్ములా!

ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ

ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజునే ఏపీలో కొత్త కేబనెట్ కొలువుదీరనుంది. కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు వీలుగా ఇప్పుడున్న మంత్రివర్గం ఈనెల 27న మూకుమ్మడి రాజీనామా చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముహుర్తాన్ని ఖరాచేరని వెల్లడైంది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజునే కొత్త కేబనెట్ కొలువుదీరే అవకాశం ఉంది. పండుగనాడే కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు వీలుగా ఇప్పుడున్న మంత్రివర్గం ఈనెల 27న మూకుమ్మడి రాజీనామా చేయనుంది. మంగళవారం వైసీపీ శాసనసభపక్ష సమావేశంలో మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణకు సంబంధించి సీఎం జగన్ ఈ మేరకు నిర్దేశం చేసినట్లు సమాచారం.

కొత్త కేబినెట్ లోనూ సీఎం జగన్ పాత ఫార్ములాలు కొన్నిటిని అనుసరించనున్నారు. ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. కొత్త కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఈసారి కూడా హోం శాఖను మహిళకే అప్పగించనున్నట్లు తెలిసింది. రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ పునర్వవ్వయస్థీకరిస్తామని జగన్ గతంలోనే ప్రకటించడం తెలిసిందే.

Cabinet Reshuffle: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం! -ఏపీ ఆర్థిక మంత్రిగా విజయసాయిరెడ్డి?


జగన్ విదించుకున్న గడువు ఆరు నెలలు ఆలస్యమైనా మొత్తానికి కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు సిద్దమయ్యారు. గత వారంలో జరిగిన పలు సమావేశాల్లో సీఎం ఈ విషయమై పదే పదే క్లారిటీ ఇస్తూవచ్చారు.   ప్రస్తుతం మంత్రుల్లో పని తీరు ఆధారంగా కేబినెట్ లో మార్చులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురికే రెండోసారీ మంత్రిగా అవకాశం దక్కొచ్చని,  పదవులు కోల్పోయినవారిని పార్టీ సేవలకు ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.

CM KCRకు ఉచ్చు బిగిస్తున్నారా? కేంద్రానికి ఫిర్యాదులు.. ఒక్క సింగరేణిలోనే రూ.50వేల కోట్ల స్కామ్.. మోదీతో కోమటిరెడ్డి


ఏపీలో మరో రెండేళ్లలో (2024లో) జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేబినెట్ పునర్వవ్యవస్థీకణ, కీలక నేతలకు పార్టీ బాధ్యతల అప్పగింత అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, Cm jagan, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు