మా తమ్ముడు బంగారం... పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్...

AP Assembly Election 2019 : పవన్ కళ్యాణ్ జీవితం ఆల్రెడీ తెరిచిన పుస్తకమే. అందులో వివాదాలు కొన్ని ఉన్నట్లే, మెచ్చుకోతగ్గ అంశాలూ చాలా ఉన్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 12, 2019, 9:46 AM IST
మా తమ్ముడు బంగారం... పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్...
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)
  • Share this:
Pawan Kalyan Nagababu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించి చాలా మందికి చాలా ఆసక్తికర విషయాలు తెలుసు. ఐతే... ఆయన సొంత అన్నయ్య అయిన నాగబాబుకి తెలిసినన్ని విషయాలు బయటివారికి తెలియకపోవచ్చు. ఈ క్రమంలో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న జబర్దస్త్ జడ్జి నాగబాబు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. తన ఫ్యామిలీ, పిల్లలు బతికేందుకు కావాల్సినంత డబ్బును పవన్ కళ్యాణ్ సంపాదించుకున్నారనీ, రాజకీయాల్లో నేతలు ఇచ్చే విరాళాలు, ప్రజలు అందించే సాయంతోనే జనసేన పార్టీ నడుస్తోందని తెలిపారు. పవన్ కళ్యాణ్ రేంజ్ ఉన్న నటుల ఆస్తి వేల కోట్ల రూపాయల్లో ఉంటుందన్న మెగా బ్రదర్... పవన్ కళ్యాణ్ ఆస్తులు మాత్రం చెప్పుకోలేనంత తక్కువగా ఉన్నాయని అన్నారు.

Mega Brother Naga Babu Interesting Comments on Janasena Chief Pawan Kalyan assets pk.. నాగ‌బాబు ఇప్పుడు కేవలం న‌టుడు మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. అవ‌స‌రం అయిన ప్ర‌తీసారి త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోరాటం చేస్తూనే ఉన్నాడు. naga babu,naga babu twitter,naga babu facebook,Naga Babu Comments on Pawan Kalyan assets,naga babu youtube channel,jabardasth comedy show judge naga babu,jabardasth judge naga babu,naga babu pawan kalyan,naga babu pawan kalyan assets,naga babu comments on pawan kalyan assets,naga babu janasena party,naga babu janasena chief pawan kalyan,telugu cinema,janasena party naga babu,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు పవన్ కళ్యాణ్ జనసేన,జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ ఆస్తులపై నాగబాబు వ్యాఖ్యలు,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)


జనసేనను ఏర్పాటు చేసినప్పుడు... రూ.1.20 కోట్ల విరాళం ఇచ్చానని నాగబాబు వివరించారు. పవన్ కళ్యాణ్ సొంతంగా సంపాదించిన డబ్బును ఎవరో ఒకరికి పంచేస్తూ ఉంటారన్న ఆయన... సినిమాలు ఫెయిలైతే తాను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చేస్తారని వెల్లడించారు. పవన్ సినిమాల్లో సూపర్ హిట్టైన అత్తారింటికి దారేది అంతలా హిట్టైనా పవన్ కళ్యాణ్‌కి పెద్దగా కలిసి రాలేదన్న నాగబాబు... ఆ టైంలో నిర్మాతకు అండగా ఉండి, కొంత డబ్బు వెనక్కి ఇచ్చి సంతకాలు చెయ్యాల్సి వచ్చిందని తెలిపారు.

హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.55 లక్షలు ఉన్నాయన్న నాగబాబు... అప్పటికప్పుడు పవన్... రూ.50 లక్షలకు చెక్కు రాసి... దాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడని తెలిపారు. మిగతా రూ.5 లక్షలని సొంత ఖర్చుల కోసమే ఉంచుకున్నారని వివరించారు. డబ్బే సంపాదించాలనే లక్ష్యం పెట్టుకుంటే, జనసేన అధినేత వేల కోట్లు సంపాదించేవాళ్లేనని తన తమ్ముడి గురించి తెలిపారు నాగబాబు. 

ఇవి కూడా చదవండి :

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?

నేటితో పరిషత్ ప్రచారం సమాప్తం... ఎల్లుండి చివరి దశ పోలింగ్

బ్యాలెన్స్ ఫార్ములాతో లగడపాటి సర్వే... వైసీపీ షాక్ ఇస్తుందా...?

 
First published: May 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు