హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అలా చేయొద్దు... వారికి రష్మీ వార్నింగ్

అలా చేయొద్దు... వారికి రష్మీ వార్నింగ్

రష్మీ గౌతమ్(Rashmi Gautam/Twitter)

రష్మీ గౌతమ్(Rashmi Gautam/Twitter)

రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రాకపోవడం బాధాకరమని రష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.

యూత్ తమకు తమకు కరోనా రాదని అనుకుంటూ.. ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్నారని జబర్ధస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ అన్నారు. ఇలాంటి వారి వల్లే వైరస్‌ వారి కుటుంబ సభ్యులకు సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రాకపోవడం బాధాకరమని రష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ అంటే శిక్ష కాదనీ.. మన భవిష్యత్తుతో పాటు, భావితరాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని ఆమె తెలిపారు. లాక్‌డౌన్‌ అనేది బాధ్యతగా భావించాలని... ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటలు సడలింపు ఇస్తుంటే.. అది రిలాక్స్‌ సమయం అన్నట్లుగా అవసరం లేకుండానే రోడ్లపైకి రావడం ఏ మాత్రం సరికాదని రష్మీ అభిప్రాయపడ్డారు. పోలీసులు, మీడియా, ప్రభుత్వాధికారులు, సిబ్బందికి సహకరించాలంటే ప్రజలంతా ఇంటిపట్టునే ఉండాలని రష్మి కోరారు. విశాఖ ప్రజలు ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.హోమ్‌ క్వారంటైన్‌ పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని రష్మీ సూచించారు.

First published:

Tags: Anchor rashmi gautam, Coronavirus, Visakhapatnam

ఉత్తమ కథలు