పవన్ కళ్యాణ్‌పై రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. ఆయన గెలిచి ఉంటేనా..?

RK Roja Selvamani | జనసేన ఓటమిపై రోజా స్పందించారు. జనసేన ఓటమికి ప్రజారాజ్యం పార్టీనే కారణం అని అన్నారు.

news18-telugu
Updated: June 14, 2019, 9:02 PM IST
పవన్ కళ్యాణ్‌పై రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. ఆయన గెలిచి ఉంటేనా..?
ఏపీ అసెంబ్లీలో రోజా
news18-telugu
Updated: June 14, 2019, 9:02 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్ సునామీలో టీడీపీ కకావికలమైంది. జనసేన పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. గాజువాక, భీమవరంలో రెండు చోట్లా వైసీపీ అభ్యర్థుల చేతిలోనే పరాజయం చెందారు. అయితే, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే బాగుండేదని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ అయిన ఆర్కే రోజా సెల్వమని అభిప్రాయపడ్డారు. జనసేన ఓటమిపై రోజా స్పందించారు. జనసేన ఓటమికి ప్రజారాజ్యం పార్టీనే కారణం అని అన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే, చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ కూడా జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తారేమో అనే సందేహం వల్లే ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టి ఉంటారని రోజా విశ్లేషించారు. అయినా, చాలా చోట్ల జనసేన గట్టి పోటీ ఇచ్చిందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో పోటీ ఎక్కువగా ఉంటుందన్న రోజా.. దాన్ని తట్టుకుని నిలబడిన వారే విజయం సాధిస్తారని చెప్పారు.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...