కల్కి ఆశ్రమంపై ఐటీ దాడులు... కీలక ఫైళ్లు స్వాధీనం ?

వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంతోపాటు వివిధ ప్రాంతాల్లోని కల్కి ఆశ్రమానికి చెందిన కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 16, 2019, 12:47 PM IST
కల్కి ఆశ్రమంపై ఐటీ దాడులు... కీలక ఫైళ్లు స్వాధీనం ?
కల్కి ఆశ్రమం
news18-telugu
Updated: October 16, 2019, 12:47 PM IST
చిత్తూరు జిల్లా సత్యేవేడు సమీపంలోని కల్కి ఆశ్రమంలో ఐటీ దాడుల కొనసాగుతున్నాయి. వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంతోపాటు వివిధ ప్రాంతాల్లోని కల్కి ఆశ్రమానికి చెందిన కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన 16 ఐటీ బృందాలు ఈ దాడుల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఆశ్రమం ప్రధాన ద్వారం మూసి వేసి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. నేడు, రేపు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల నుంచి ఐటీ రిటర్న్ సరిగ్గా చెల్లించకపోవడంతో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. నాలుగు రాష్ట్రాల్లోని కల్కి ఆశ్రమానికి సంబంధించిన కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

కల్కి ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మిక పరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్మును భూముల కొనుగోలు, డిపాజిట్ల వంటివాటిపై దుర్వినియోగం అవుతున్నట్టు తమిళనాడు ఐటీ అధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమిళ్ నాడు ఐటీ అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై దాడులకు పూనుకున్నట్లు తెలిసింది. బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్యపాలెం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించి వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది.First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...