రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ (Income Tax Department) రైడ్స్ కలకలం రేపుతున్నాయి. అటు హైదరాబాద్ (Hyderabad), ఇటు విజయవాడ (Vijayawada)లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో వంశీ రామ్ బిల్డర్ సంస్థకు చెందిన సుబ్బారెడ్డి అతని బంధువుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.మరోవైపు విజయవాడలో వైసిపి నేతలు వల్లభనేని వంశీ (VallabhaneniVamshi), దేవినేని అవినాష్ (Devineni Avinash) ఇళ్లపై కూడా అధికారులు రైడ్స్ చేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసాలతో పాటు, కార్యాలయాల్లో ఐటీ (Income Tax Department) అధికారులు సోదాలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి నివాసంతో పాటు ఆయన బావమరిది జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. వంశీ మొత్తం 15 చోట్ల ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుండే అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తం 4 వాహనాల్లో 12 మంది అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
విజయవాడలో..
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , దేవినేని అవినాష్ ఇళ్లల్లో 5 బృందాలు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఉదయం ఎవరూ లేవకముందే వాహనాల్లో ఇళ్ల వద్దకు చేరుకున్న అధికారులు రైడ్స్ చేపట్టారు. ఇద్దరి నాయకుల ఇళ్లలోకి వెళ్లిన అధికారులు ఎవరిని బయటకు పంపించడం లేదు. అలాగే బయట ఉన్న వారిని లోపలికి పంపించడం లేదు. అయితే హైదరాబాద్ లో దేవినేని అవినాష్ కు సంబంధించిన భూ క్రయా విక్రయాలకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. వంశీ బిల్డర్స్ తో అవినాష్ భూములకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోదాలు చేపట్టారు.
రెండు రాష్ట్రాల్లో..30 చోట్ల తనిఖీలు..
కాగా దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి, జనార్దన్ రెడ్డి, సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. భారీగా అక్రమ ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు ఐటీ ఆరోపిస్తుంది. ప్లాట్ కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో బ్లాక్ లో మనీ వసూలు చేసినట్టు తెలుస్తుంది. అలాగే లిటిగేషన్ భూములను కొనుగోలు చేసి ప్రాజెక్టులను గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే వంశీ బిల్డర్స్ 80కి పైగా ప్రాజెక్టులను నిర్మించినట్టు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Income tax, Telangana