హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

IT Raids: హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం..ఈసారి ఆ కంపెనీ టార్గెట్ గా..

IT Raids: హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం..ఈసారి ఆ కంపెనీ టార్గెట్ గా..

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్!

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్!

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్ (Income Tax Raids) సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలలో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీల్లో, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  (Income Tax Raids) జరిగాయి. ఇక తాజాగా మరోసారి ఏపీ, తెలంగాణలో సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్ సంస్థలో 50 టీమ్స్ ఏకంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్ (Income Tax Raids) సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలలో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీల్లో, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  (Income Tax Raids) జరిగాయి. ఇక తాజాగా మరోసారి ఏపీ, తెలంగాణలో సోదాలు జరుగుతున్నాయి. వసుధ ఫార్మా కంపెనీ, పెట్రో కెమికల్ సంస్థలో 50 టీమ్స్ ఏకంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.

Telangana Budget : తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం.. ప్రభుత్వానికి ఉపశమనం

అటు తెలంగాణలో..ఇటు ఏపీలో..

హైదరాబాద్ లో తో పాటు పలు జిల్లాల్లో వసుధ ఫార్మా కంపెనీలో ఐటీ రైడ్స్  (Income Tax Raids) కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా పేరుతో రాజు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. మొత్తం 15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు ఐటీ గుర్తించింది. ఈ ఫార్మా కంపెనీకి రాజు చైర్మన్ గా ఉండగా..ఆరుగురు డైరెక్టర్లు కార్యకలాపాలు చూస్తున్నారు. వీరందరి ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అలాగే ఏపీలోని విజయవాడ , విశాఖ, గుంటూరులో కూడా ఐటీ రైడ్స్  (Income Tax Raids) జరుగుతున్నట్లు తెలుస్తుంది. రైడ్స్ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Telangana: రాజ్‌భవన్‌కు చేరుకున్న తెలంగాణ మంత్రి.. బడ్జెట్‌‌తో పాటు పెండింగ్ బిల్లులపై చర్చ

కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు భారీగా పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు.

ఇక గత నెలలో కూడా వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. అయితే హైదరాబాద్ లో వరుస ఐటీ రైడ్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కొన్నిరోజుల్లో ఎన్నికలు ఉండగా ఐటీ అధికారులు తరచూ రైడ్స్ ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ పెడుతున్నాయి.

First published:

Tags: Ap, Hyderabad, Income tax, Telangana