Home /News /andhra-pradesh /

చంద్రబాబును ఇరికించడం అసాధ్యం.. వైసీపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం...

చంద్రబాబును ఇరికించడం అసాధ్యం.. వైసీపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం...

చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత (File)

చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత (File)

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ మీద సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

  ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమరావతి అంశం దుమారం రేపుతుంటే, టీడీపీ - వైసీపీ మధ్య ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం అగ్గిరాజేస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ మీద సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న నరసాపురం ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం చంద్రబాబును ఇరికించడం సాధ్యం కాదన్నారు. చట్టాలు మార్చితే తప్ప ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఇటీవల రఘురామకృష్ణం రాజు వైసీపీలో హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నారు.

  Ap news, ap politics, ysrcp, ap cm ys jagan mohan reddy, raghuramakrishnam raju, bjp, pm modi, ఏపీ న్యూస్, వైసీపీ, జగన్, రఘురామకృష్ణంరాజు, బీజేపీ, ప్రధాని మోదీ
  రఘురామకృష్ణం రాజు, (నర్సాపురం, వైసీపీ)


  అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేస్తామని ముందే తెలిసిన టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, టీడీపీ నేతలు ముందే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రిపోర్టులో పేర్కొంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన వారిలో ముఖ్యమైన వారి పేరుతో ఆరుగురి పేర్లను కేబినెట్ సబ్ కమిటీ పొందుపరించింది. ఆ పేర్లలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు, వేమూరు రవికుమార్ (నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు), పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్ పేర్లను ప్రముఖంగా ప్రస్తావించింది. లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను కూడా ఆ జాబితాలో పొందుపరిచింది.

  Chandrababu naidu, Amaravati, ys jagan, చంద్రబాబు, అమరావతి, సీఎం జగన్
  చంద్రబాబు నాయుడు


  వీరితో పాటు ఎవరెవరు ఏయే పేర్లతో భూములను కొనుగోలు చేశారో తెలియజేస్తూ మరికొన్ని పేర్లను కూడా జోడించింది. అందులో మాజీ మంత్రి నారాయణ, కొమ్మాల పాటి శ్రీధర్, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారా లోకేష్, కోడెల శివప్రసాదరావు పేర్లను కూడా అందులో పొందుపరిచింది. సీఆర్డీఏ సరిహద్దులను మార్చడం ద్వారా టీడీపీకి చెందిన మరికొందరు నేతలు, కంపెనీలకు లబ్ధి చేకూర్చిందంటూ మరో లిస్టును పొందుపరిచింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, MP raghurama krishnam raju

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు