ఇస్రో కీలక నిర్ణయం.. త్వరలోనే షార్ నుంచి రాకెట్..

శ్రీహరికోట (ఫైల్ ఫోటో)

కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రయోగాలను వాయిదా వేయడంతో పాటు పనులను సైతం నిలిపేశారు. అయితే తాజాగా వీలైనంత త్వరగా పనులు చేసి పీఎస్ఎల్‌వీ ప్రయోగం చేయనున్నట్టు తెలుస్తోంది.

  • Share this:
    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్(సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్) నుంచి రాకెట్ ప్రయోగాలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కైలాసవాడివో శివన్ పలు కేంద్రాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వాస్తవానికి కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రయోగాలను వాయిదా వేయడంతో పాటు పనులను సైతం నిలిపేశారు. అయితే తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో వీలైనంత త్వరగా పనులు చేసి జూలై నెలాఖారులో గానీ ఆగస్టు మొదటి వారంలో గానీ పీఎస్ఎల్‌వీ ప్రయోగం చేయనున్నట్టు తెలుస్తోంది.

    అందుకోసం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరు నుంచి ఈనెల 8న పలువురు శాస్త్రవేత్తలు షార్‌కు రానున్నారు. అయితే వారికి ఇక్కడ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతే పనుల్లో చేరతారు. ఇదిలావుంటే.. ఇప్పటికే షార్‌లో పీఎస్ఎల్వీ-సి49, 50 వాహక నౌకలు ప్రయోగాలను సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు వాహక నౌకలను, ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపాల్సి ఉంది. విదేశీ ఉపగ్రహాలు సైతం పీఎస్ఎల్వీ ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టాల్సి ఉంది.
    Published by:Narsimha Badhini
    First published: