నేడు ఇస్రో మరో ప్రయోగం... నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-48

రాహుకాలాన్ని దృష్టిలో ఉంచుకునే కౌంట్‌డౌన్‌ను ఆలస్యంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 11, 2019, 8:09 AM IST
నేడు ఇస్రో మరో ప్రయోగం... నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-48
నేడు ఇస్రో మరో ప్రయోగం... నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-48
  • Share this:
నెల్లూరు జిల్లా శ్రీహరికోట మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. షార్ కేంద్రం నుంచి ఇవాళ మధ్యాహ్నం 3.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి 48 వాహకనౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 4.40కే మొదలయ్యింది. 4.25 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించాలని రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశాల్లో నిర్ణయించారు. రాహుకాలాన్ని దృష్టిలో ఉంచుకునే కౌంట్‌డౌన్‌ను ఆలస్యంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి 4.30వరకు రాహుకాలం ఉంది. దీంతో 4.25 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంట్‌డౌన్‌ను 15 నిమిషాలు ఆలస్యంగా 4.40కి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రయోగ సమయాన్ని మాత్రం మార్చలేదు. ముందుగా నిర్ణయించినట్లే బుధవారం మధ్యాహ్నం 3.25కు నింగిలోకి పంపనున్నారు. పీఎస్‌ఎల్‌వీ-సి48 వాహకనౌక మనదేశానికి చెందిన రీశాట్‌-2బీఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
First published: December 11, 2019, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading